ట్రెండీ స్టోరి: తెల్ల‌ చొక్కాలు తొడిగిన‌ కిల్ల‌ర్ హాట్ గాళ్స్

Update: 2021-03-02 02:30 GMT
ప‌బ్లిక్ లోకి వెళ్లిన‌ప్పుడు ఎంత స్టైలిష్ గా క‌నిపిస్తే అంత‌గా షో స్టాప‌ర్ గా నిలుస్తారు. స్టైల్ తో పాటు కంఫ‌ర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక ఫ్యాష‌న్ ప్ర‌పంచానికి ఎంతో విలువ ఉండే రంగుల ప్ర‌పంచంలో అందాల క‌థానాయిక‌లు నిరంతరం దీనిని ఫాలో చేయాల్సిందే.

అయితే ప‌లు సంద‌ర్భాల్లో బాలీవుడ్ అందాల భామ‌లు క‌త్రిన‌.. శ్ర‌ద్ధా.. కియ‌రా వంటి భామ‌లు ధ‌రించిన దుస్తులు ట్రెండీ టాపిక్ అయ్యాయి.
తారా సుతారియా. .. దీపికా పదుకొనే.. అలియా భట్.. అనుష్క శ‌ర్మ చాలా సంద‌ర్భాల్లో తెల్ల చొక్కాల‌తో స్పెష‌ల్ గా క‌నిపించారు. వేసవి తాపం మొద‌ల‌వుతున్న వేళ వీళ్లంతా తెల్ల చొక్కాల్ని ట్రెండ్ చేస్తున్నారు. తెలుపు నాణ్యం.. పైగా సూర్య ర‌శ్మి నుంచి వేడిమిని గ్ర‌హించ‌దు. అందుకే ఫ్యాషన్ డిజైన‌ర్లు వీటికి ప్రాధాన్య‌త‌నిస్తున్నారు.

తెల్లటి చొక్కాను జాకెట్టుగా ఎలా మార్చాలో కియారా అద్వానీ నుండి పాఠాలు నేర్చుకోవ‌చ్చు. ఆ ఇండో-వెస్ట్రన్  లెహంగా సంథింగ్ హాట్!కత్రినా కైఫ్ లాగా క్లాసిక్ గా లుక్ కావాల‌న్నా ఇది ప‌రిశీలించ‌వ‌చ్చు.  జీన్స్ మీద తెల్లటి చొక్కా ధరిస్తే అది సంథింగ్ స్పెష‌ల్. ఆ చల్లని రాత్రులలో డెనిమ్-ఆన్-డెనిమ్ ప్రో లుక్ ఇది. ప్రకాశవంతమైన రంగు జత కాగితపు బ్యాగ్ ప్యాంటు వైట్ ష‌ర్ట్ తో అద‌ర‌గొట్టింది శ్ర‌ద్ధా. ఆఫ్-డ్యూటీ లేదా డేట్ నైట్ లుక్ కోసం ఇలాంటివి తెల్ల చొక్కా మీద ధ‌రించాల‌ట‌.
Tags:    

Similar News