• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఊర్వశి అంటున్న చరణ్...

ఊర్వశి అంటున్న చరణ్ హీరోయిన్

By - Tupaki Desk
Update: 2018-08-23 11:21 GMT
టాలీవుడ్ ఎంట్రీ నే మహేష్ బాబు రామ్ చరణ్ లాంటి క్రేజీ హీరోస్ పక్కన చేసిన హీరోయిన్ కియారా అద్వానీ ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ లో కూడా హాట్ గర్ల్ గా మారిపోయింది. డిమాండ్ మాములుగా లేదు. కథ కోరితే బోల్డ్ పాత్రలకు కూడా సై అంటున్న కియారా ఈ మధ్య చేసిన లస్ట్ స్టోరీస్ చాలా పేరు తీసుకొచ్చింది. ఫీచర్ ఫిలిం కాకపోయినా నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలైన ఈ వెబ్ మూవీ చూసాక అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న కియారా ఇప్పుడో వీడియో సాంగ్ ద్వారా వార్తల్లో నిలుస్తోంది. అది కూడా రీమేక్ సాంగ్ కావడం విశేషం. సుమారు పాతికేళ్ల క్రితం ప్రభుదేవా హీరోగా పరిచయమైన ప్రేమికుడు సినిమాలో ఊర్వశి ఊర్వశి పాటను ఇప్పుడు రీ షూట్ చేస్తున్నారు. కియారాతో పాటు ఇందులో షాహిద్ కపూర్ కూడా ఉంటాడు. కానీ ఇది సినిమా కోసం కాదు. కేవలం ఆన్ లైన్ లో వీడియో ఆల్బం రూపంలో మాత్రమే రిలీజ్ చేస్తారు.

అలా అని ఇది అంత ఈజీగా అయిపోవడం లేదు. బేస్ మెంట్ లో వేడిగా పొగలు కక్కుతున్న స్టేజి మీద చెమట్లు కారుస్తూ లైట్ ఎఫెక్ట్స్ తో పాటు స్మోక్ ని భరిస్తూ కియారా షాహిద్ కష్టపడుతూ ఉన్న ఫోటోస్ ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి. ప్రభుదేవా కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలో పాట మాత్రమేగా కాక వన్ అఫ్ ది బెస్ట్ కొరియోగ్రాఫ్డ్ సాంగ్ గా పేరు తెచ్చుకున్న ఊర్వశి పాటను ఏ మాత్రం తేడాగా చేసినా సోషల్ మీడియాతో పాటు అభిమానులు ఫుట్ బాల్ ఆడటం ఖాయం. అందుకే కియారాతో పాటు షాహిద్ సైతం దర్శకుడు గిఫ్టీ నేతృత్వంలో బాగా కష్టపడుతున్నారు. ప్రభుదేవాకు చెడ్డ పేరు తేకుండా దాని స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఊర్వశిని ఎలా రీ క్రియేట్ చేశారో తెలియాలంటే ఆన్ లైన్ విడుదల అయ్యే దాకా వేచి చూడాల్సిందే. ఇది కాకుండా కియారా భారీ మల్టీ స్టారర్ కలంక్ లో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. సౌత్ లోనే బాగా సెటిల్ అవ్వాలని చూస్తున్న కియారా రామ్ చరణ్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయితే రేంజ్ ఎక్కడి దాకా వెళ్తుందో చెప్పాలా.
Tags:    
  • Kiara Advani 
  • Shahid Kapoor 
  • Prabhudheva 
  • Urvashi 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS