• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేజీఎఫ్‌- చాప్టర్ 2 కొత్త...

కేజీఎఫ్‌- చాప్టర్ 2 కొత్త రిలీజ్ తేదీ ఇదే

By - Tupaki Desk
Update: 2021-01-22 03:30 GMT
కేజీఎఫ్ చాప్టర్ 1 సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో సీక్వెల్ పైనే అంద‌రి దృష్టి. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే ప్రశాంత్ నీల్ నుంచి పార్ట్ 2 రాబోతోంద‌ని ఇటీవ‌ల టీజ‌ర్ చెప్ప‌క‌నే చెప్పింది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ టీజర్ తో హీట్ పెంచారు.

చాప్ట‌ర్ 2 టీజ‌ర్ రిలీజైన 24 గంట‌ల్లోనే వైర‌ల్ గా దూసుకెళ్లింది. దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. అయితే ఈ సినిమా రిలీజ్ ప‌లుమార్లు వాయిదా ప‌డ‌డంతో కొత్త విడుదల తేదీ పై ఇప్ప‌టివ‌ర‌కూ క్లారిటీ లేదు.

తాజా స‌మాచారం మేర‌కు.. రిలీజ్ తేదీని లాక్ చేశార‌ని తెలిసింది. కేజీఎఫ్‌ చాప్టర్ 2 మే 30 న అన్ని భారతీయ భాషలలో తెరపైకి వస్తుందని తాజాగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ తేదీ విష‌యాన్ని  దేశవ్యాప్తంగా ఉన్న పంపిణీదారులందరికీ మేకర్స్ తెలియజేశారట‌.

ఇప్ప‌టికే బిజినెస్ ప‌రంగానూ స్పీడ్ గానే ఉన్నార‌ట‌. కేజీఎఫ్ 1 ని రిలీజ్ చేసిన‌ సాయి కొర్రపాటి కేజీఎఫ్ చాప్ట‌ర్ 2ని కూడా తెలుగులో రిలీజ్ చేయ‌నున్నారు. తెలుగు రాష్ట్రాలలో థియేటర్ హక్కులు ప్రస్తుతం అమ్ముడయ్యాయి. అతను తెలుగు జిల్లాల హక్కుల కోసం భారీ ధరలను కోట్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది‌.

కెజిఎఫ్: చాప్టర్ 2 లో యష్- శ్రీనిధి శెట్టి- సంజయ్ దత్ - రవీనా టాండన్- ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి సంబంధించిన రిలీజ్ తేదీని త్వ‌ర‌లోనే మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలిసింది.
Tags:    
  • KGF2 
  • Tollywood 
  • Movie News 
  • Tupaki News 
  • Telugu News 
  • Telugu Cinema 
  • Tupaki Updates 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS