`కేజీఎఫ్-2` ని వెంటాడుతోన్న బాలీవుడ్!
కొవిడ్-19 థర్డ్ వేవ్ తగ్గడంతో వాయిదా పడ్డ చిత్రాలన్నీ మళ్లీ రిలీజ్ తేదీల్ని లాక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు చిత్రాలు తేదీల్ని లాక్ చేసి పెట్టాయి. ఫిబ్రవరి 25 నుంచి థియేటర్లలో జాతర మొదలవ్వబోతుంది. అప్పటి నుంచి వరుసగాఒకదాని వెంబడి ఒకటి రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.
బాలీవుడ్ చిత్రాలు కూడా ఇదే రేసులో నిలిచాయి. ఉత్తరాదిన చాలా రాష్ర్టాలో కోవిడ్ ఆక్షలు సడలించడంతో ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. ఇందులో పాన్ ఇండియా కేటగిరిలో అన్ని భాషల్లో బరిలోకి దిగుతోంది `కేజీఎఫ్-2`. `కేజీఎఫ్` మొదటి చాప్టర్ పెద్ద సక్సెస్ అయిన నేపథ్యంలో చాప్టర్-2పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంతకంతకు వేడి పెంచుతున్నాయి. సరిగ్గా ఇదే రోజున మిస్టర్ పర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా` చాప్టర్ -2కి పోటీగా దిగడానికి రెడీ అయింది. దీంతో హిందీలో బాక్సాఫీస్ వద్ద బిగ్ వార్ తప్పదనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అనూహ్యంగా అమీర్ చిత్రాన్ని వాయిదా వేసారు.
ఆగస్ట్ 11న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో `కేజీఎప్ -2` ఎలాంటి పోటీ లేకుండా బాక్సాఫీస్ బరిలోకి దిగతుందని..వార్ వన్ సైడ్ అనే సంకేతాలు అని అంతా ఫిక్సై అయ్యారు. కానీ` కేజీఎఫ్-2`ని వదలని బొమ్మాళ్లి అంటూ మరో బాలీవుడ్ చిత్రం ఎప్రిల్ 14నే రిలీజ్ కి రెడీ అయింది.
అదే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ `జెర్సీ` హిందీ రీమేక్. ఈ చిత్రాన్ని `కేజీఎఫ్ -2` రిలీజ్ రోజున విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాపై ఉత్తరాదిన మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి బజ్ ని తీసుకొచ్చాయి.
పైగా `జెర్సీ` క్రికెట్ నేపథ్యం ఉన్న స్టోరీ. స్టార్ బ్యాట్స్ మ్యాన్ బయోపిక్ నేపథ్యంతో కూడిన కథ కావడం అంతకు మించి ఉత్తరాదిన హైప్ ని తీసుకొస్తున్నాయి. దీంతో `కేజీఎఫ్-2`..`జెర్సీ` బాక్సాఫీస్ వద్ద నువ్వా? నేనా ? అన్న రేంజ్ లో పోటీ తప్పదని తెలుస్తోంది.
రెండు చిత్రాలు హిట్ కంటెంట్ వి కావడంతో దేశం మొత్తం ఈ చిత్రాల సకెస్స్ గురించి ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తోంది. `జెర్సీ` హిందీలో అల్లు అరవింద్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. `కేజీఎఫ్ -2` లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించడం అక్కడ సినిమాకి కలిసొచ్చే అంశం.
యశ్ పాన్ ఇండియా ఇమేజ్...మాస్ బజ్ అతనికి హిందీలో పాజిటివ్ వైబ్ గా చెప్పొచ్చు. ఇక షాహిద్ క పూర్ యూత్ స్టార్. యువతలో మంచి క్రేజ్ ఉన్న హీరో. డిఫరెంట్ అటెంప్ట్ లు చేసి సక్సెస్ అయిన హీరోగాను మంచి గుర్తింపు ఉంది. ఇలా యూనిక్ ఐడెంటిటీ ఉన్న ఇద్దరు హీరోలు బాక్సాపీస్ బరిలోకి దిగుతున్నారు. మరి అంతిమంగా ఎవరిది పై చేయి అవుతుందో చూద్దాం.