క్యాన్సర్ చికిత్సతో `అధీరా`కు మచ్చలు.. అయినా ఫోటోలకు అడ్డు చెప్పడేమి!?
బాలీవుడ్ మున్నా భాయ్ కి మూడో దశ ఊపిరితిత్తుల క్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. దీనికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక థెరపీలో భాగంగా సంజయ్ దత్ ఈ బుధవారం తన స్నేహితుడు కం స్టైలిస్ట్ హకీమ్ ఆలీమ్ సెలూన్లో కనిపించాడు. తన చికిత్సకు ముందు వస్త్రధారణ సెషన్ కోసం వెళ్ళాడు. అతను సెలూన్ వెలుపల తన కోసం ఎదురుచూస్తున్న ఫోటోగ్రాఫర్లను చూస్తూ నవ్వుతూ ఎంతో సానుకూలంగా స్పందించారట. అనారోగ్యంతో ఉన్నా.. తన ఫోటోల కోసం ఆరాటపడిన వారిని ఏమీ అనలేదు. సరికదా.. ఫోటోలకు ఫోజులిచ్చాడిలా. ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకునేందుకు ఎలాంటి భేషజం చూపించలేదు. తాను అనారోగ్యంతో ఉన్నానని రాయడం మానేయమని మాత్రం చెప్పాడు.
హెయిర్ కట్ చేయించుకున్నాక.. హకీమ్ ఆలీమ్ సెలూన్ నుండి దత్ ఓ వీడియోను పంచుకున్నాడు. చికిత్సా సమయంలో తన హెడ్ పై మచ్చలని చూపించాడు. అందుకు ఏమాత్రం భేషజానికి పోలేదు. “ఇది నా జీవితంలో ఇటీవలి మచ్చ. కానీ నేను కొడతాను. త్వరలో ఈ క్యాన్సర్ నుండి బయటపడతాను” అంటూ సంజూ భాయ్ ఎమోషన్ కి గురయ్యారు. నిజానికి క్యాన్సర్ చికిత్సలో కీమో థెరపీ ఎంతో క్లిష్టమైనది. హెయిర్ ఫాల్ ఉంటుంది. ఒళ్లంతా మచ్చలు ఏర్పడతాయని చెబుతారు. ప్రస్తుతం దత్ పరిస్థితి అలానే ఉంది.
కేజీఎఫ్ 2 షూటింగులో పాల్గొంటున్న దత్ కి ఉన్నట్టుండి పెయిన్ వస్తే ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆ సమయంలో సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. వెంటనే క్యాన్సర్ కి చికిత్స ప్రారంభించారు. చికిత్స కోసం వెళ్లేముందు అతను తన పని పెండింగ్ షూట్ ని నిబద్ధతతో పూర్తి చేశాడు. అతను తన కుటుంబంతో కలిసి దుబాయ్ లో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అందుకు సెలవు తీసుకున్నాడు. అతను చికిత్స తీసుకుంటూనే.. ఇప్పుడు కెజిఎఫ్ 2 షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. విలన్ అధీరా పాత్రను అతడు పోషిస్తున్న సంగతి తెలిసినదే. యష్ ఇందులో రాకీ భాయ్ గా నటిస్తుండగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.