కొత్త బ్యూటీ ఫోటోలకు డిమాండ్ పెరిగింది!

Update: 2019-10-11 13:06 GMT
'ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది' అని అప్పట్లో ఒక యాడ్ వచ్చేది.  చాలామందికి ఆ క్యాప్షన్ తెగ కనెక్ట్ అయింది. మరి ఒక్క ఐడియా మన జీవితాన్ని మారుస్తుందో కానీ ఒక్క సరైన పోస్టర్ మాత్రం హీరోయిన్ జీవితాన్ని మార్చేయగలదు.  రీసెంట్ గా కేతిక శర్మ విషయంలో అలానే జరిగిందని అంటున్నారు.  ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతున్న 'రొమాంటిక్' సినిమాలో కేతిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే భామకు డెబ్యూ ఫిలిం. రీసెంట్ గా 'రొమాంటిక్' పోస్టర్ లు రిలీజ్ అయ్యాయి. ఆ పోస్టర్ ఒకటి నెటిజన్లను ఫుల్ గా ఆకర్షించింది.

టాప్ లేకుండా.. ఎటువంటి ఇన్నర్ వేర్ లేకుండా హీరో ఆకాశ్ ను గట్టిగా గాలిదూరే గ్యాప్ లేకుండా హత్తుకున్న యమా ఘాటు పోస్టర్ అది.  కుర్రకారునే కాకుండా కుర్ర హృదయాలు ఉన్న వయసుపైబడినవారికి కూడా ఆ పోస్టర్లు చూసి జివ్వనిపించింది.  సంప్రదాయం.. కల్చర్ అనే మాటలు ఎన్ని ఉన్నా... ఎన్ని చెప్పినా ఇలాంటి పోస్టర్లకు డిమాండ్ ఎక్కువ.  అందుకే ఒక్కసారిగా కేతిక హాట్ టాపిక్ అయింది.  ఇప్పటికే ఇండస్ట్రీలో కేతిక గురించి ఎంక్వైరీలు వస్తున్నాయట.
Read more!

మరోవైపు ఇప్పటివరకూ ఈ కేతిక గురించి పెద్దగా తెలియని నెటిజన్లు కేతిక సోషల్ మీడియా ఖాతాలను ఫాలో కావడం.. ఇన్స్టా లో పాత ఫోటోలను చూసి లైక్స్ కొట్టడం కామెంట్లు పెట్టడం చేస్తున్నారట. ఇది నిజమా కదా అని చూస్తే కేతిక ఇన్స్టాగ్రామ్ లోని పాత ఫోటోలకు 'రొమాంటిక్' పోస్టర్ లు రిలీజ్ అయిన తర్వాత కొత్త కామెంట్లు ఉన్నాయి.  అంటే పూరి స్కూలు నుంచి వచ్చిన ఒక్క బోల్డు పోస్టర్ కేతికను నెటిజన్ల హృదయ గీతికగా మార్చేసిందన్నమాట.  ఇక సినిమా కనుక క్లిక్ అయితే..కాస్త డీసెంట్ యాక్టింగ్ చేస్తే కేతిక టాలీవుడ్ లో దుమ్ము లేపడం ఖాయమేనని అంటున్నారు.  అన్నట్టు పాత ఫోటోలగురించి  మాట్లాడుకుంటున్నాం కదా.. కేతిక పాత ఫోటోలపై ఓ లుక్కేయండి. 
Tags:    

Similar News