స్టార్ డైరెక్టర్ బయోపిక్ లో కీర్తిసురేష్.. ఓకే..నా?

Update: 2020-04-25 03:30 GMT
టాలీవుడ్ లో నేను శైలజ, నేను లోకల్ సినిమాలతో హీరోయిన్గా పర్వాలేదు అనిపించింది నటి కీర్తిసురేష్. చాలా మంది కీర్తిలో స్పెషల్ ఏముందిలే అని లైట్ తీసుకున్నారు. కానీ అలా అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మహానటి సినిమాతో తన నట విశ్వరూపాన్ని నిరూపించుకుంది కీర్తి. అప్పటినుండి తను మిగిలిన హీరోయిన్స్‌తో పోలిస్తే ప్రత్యేకం అయింది. ఈ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. సావిత్రి పాత్రకు నిజంగానే ప్రాణం పోసింది కీర్తి. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే కీర్తి సురేష్ మాత్రమే అనేంతలా జీవించేసింది. మహానటి తర్వాత కీర్తితో సినిమాలు చేయడానికి అన్నీ ఇండస్ట్రీల దర్శక నిర్మాతలు అందరూ క్యూ కట్టారు. కీర్తి మాత్రం కథల ఎంపికలో చాలా కేర్ తీసుకుంటుంది.

ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియాతో పాటు నితిన్ హీరోగా వస్తున్న రంగ్ దేలో నటిస్తుంది. ఇదిలా ఉంటే కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని చెప్పడం తో కీర్తి సురేష్ చేసే సినిమాల సంఖ్య దాదాపు తగ్గిపోయింది. ఇప్పుడు మరో లెజెండరీ నటి బయోపిక్‌ లో కీర్తి నటించబోతుందనే ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య.. దివంగత విజయ నిర్మల జీవిత కథ ఆధారంగా ఒక సినిమా రూపొందించాలని ఆమె తనయుడు నరేష్ ప్రయత్నిస్తున్నాడట. అయితే ఆ సినిమాలో టైటిల్ రోల్ కోసం కీర్తిసురేష్ తో సంప్రదింపులు జరుపుతున్నాడట నరేష్. ఇక మహానటితో క్రేజ్ రావడంతో ఈ పాత్ర చేయడానికి కీర్తి చాలా డిమాండ్ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన విజయ నిర్మల.. 50 సినిమాలకు దర్శకత్వం కూడా వహించిన లేడీ డైరెక్టర్ గా రికార్డు సృష్టించింది. ఆమె పాత్రలో కీర్తి నటిస్తే మాత్రం అది ఓ అద్భుతం అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
    

Tags:    

Similar News