ఒకేసారి ఇద్ద‌రు సూప‌ర్ స్టార్ల‌తో మ‌హాన‌టికి టెన్ష‌నే

Update: 2020-12-10 03:39 GMT
అందాల క‌థానాయిక కీర్తి సురేష్ ఇటీవ‌ల టాలీవుడ్ కి దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ అజ్ఞాత‌వాసి ఫ్లాప్ అయిన త‌ర్వాత నాయికా ప్ర‌ధాన చిత్రాల‌పై దృష్టి సారించిన కీర్తి అటు హిందీ ప‌రిశ్ర‌మ‌లోనూ ఓ చిత్రానికి సంత‌కం చేసింది.

ఈ బ్యూటీ ప్ర‌స్తుత సన్నివేశం ప‌రిశీలిస్తే కీర్తి బ్యాక్ టు బ్యాక్ సూప‌ర్ స్టార్ల‌తో ప‌ని చేయ‌నుంది. కీర్తి సురేష్ డిసెంబర్ - జనవరిలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లతో షూటింగ్ ప్రారంభించి బిజీ కానున్నారు.

వచ్చే నెలలో తన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన తమిళ-తెలుగు ద్విభాషా చిత్రీకరణను వచ్చే వారం ప్రారంభించనున్నారు. రజనీ హైదరాబాద్ వచ్చి `అన్నాతే` సుదీర్ఘ షెడ్యూల్ ని పూర్తి చేయనున్నారు. డిసెంబర్- జనవరి నెలల్లో ఈ చిత్రానికి కాల్షీట్లు ఇవ్వగలిగేలా ఇత‌ర క‌మిట్ మెంట్ల‌ను షెడ్యూల్ చేయాల్సిందిగా మేకర్స్ కీర్తి సురేష్ ‌ను కోరారు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార- మీనా లాంటి అగ్ర నాయిక‌లు న‌టిస్తున్నారు.

వచ్చే నెలలో సూపర్ స్టార్ మహేష్ `సర్కారు వారి పాట` రెగ్యుల‌ర్ చిత్రీకరణ ప్రారంభం కానుండ‌గా... కీర్తి జాయిన్ కావాల్సి ఉంటుంది.  ఒకేసారి ఇరువురు సూపర్ స్టార్లకు తేదీలు కేటాయించ‌డం కీర్తికి కాస్త ట‌న్ష‌నేన‌ని చెప్పాలి. ప్ర‌తిదీ ప్రాధాన్య‌తా క్ర‌మంలో ప‌క్కాగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది.
Tags:    

Similar News