వీడియో : డైరెక్టర్‌ ను పరిగెత్తించి మరీ కొట్టిన హీరోయిన్‌

Update: 2020-12-04 05:06 GMT
కీర్తి సురేష్‌ ఇటీవల ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఒక ఫొటోను షేర్‌ చేసింది. సెట్‌ లో తాను చిన్న నిద్ర తీసినందుకు దర్శకుడు వెంకీ మరియు నితిన్‌ లు ఇలా చేశారు. అందుకే సెట్‌ లో మళ్లీ ఎప్పుడు కూడా నిద్ర పోవద్దని అర్థం అయ్యిందని పేర్కొంది. ప్రస్తుతం దుబాయిలో రంగ్‌ దే చివరి షెడ్యూల్‌ చిత్రీకరణలో ఉన్న యూనిట్‌ సభ్యులు సరదాగా గడుపుతున్నారు. తనను నిద్ర పోతున్న సమయంలో సెల్ఫీ తీసినందుకు గాను వెంకీ అట్లూరిపై రివేంజ్‌ తీర్చుకున్నాను అంటూ అతడిని గొడుగు పట్టుకుని వెంట పడి కొడుతున్న వీడియోను షేర్‌ చేసింది.

ఒకరిపై రివేంజ్‌ పూర్తి అయ్యింది. రెండవ వారిపై రివేంజ్‌ మిగిలి ఉందంటూ కీర్తి సురేష్‌ త్వరలో తాను నితిన్‌ పై కూడా రివేంజ్‌ తీర్చకుంటాను అంటూ ఫన్నీగా పెట్టింది. మరి కొన్ని రోజుల్లో దుబాయి షెడ్యూల్‌ పూర్తి చేసుకుని యూనిట్‌ సభ్యులు అంతా కూడా ఇండియాకు తిరిగి రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ మొత్తం చాలా సరదాగా అహ్లాదకర వాతావరణం లో జరిగింది అనేందుకు వీరి సరదా ఫొటోలు వీడియోలు సాక్ష్యం. నితిన్‌.. కీర్తి సురేష్‌ లు మొదటి సారి కలిసి నటించిన ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ అయితే విడుదల అయ్యే అవకాశం ఉంది.
Full View
Tags:    

Similar News