రేంజ్ రాకముందే చుక్కలు చూపిస్తోందా?

Update: 2016-12-04 09:30 GMT
కీర్తి సురేష్ ఇప్పుడు టాలీవుడ్ లో బోలెడంత డిమాండ్ ఉన్న హీరోయిన్. పవన్ పక్కన. త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నానని చెప్పగానే ఈమెకు వరుసగా ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. మలయాళీ భామ అయినా.. తమిళ్ సినిమాలతో బిజీ అయేందుకు ప్రయత్నిస్తున్న ఈ బ్యూటీని.. టాలీవుడ్ నెత్తిన పెట్టుసుకోవడంతో సడెన్ స్టార్ హీరోయిన్ రేంజ్ లో బిహేవ్ చేసేస్తోందిట కీర్తి సురేష్.

తెలుగులో ఈమె నటించిన మొదటి సినిమా 'అయినా ఇష్టం నువ్వు' మూవీ కనీసం రిలీజ్ కూడా కాకపోయినా.. విడుదలయిన సినిమాల్లో రామ్ తో నటించిన 'నేను శైలజ' సక్సెస్ కావడం.. అందులోనూ ఈమె యాక్టింగ్ పేరు రావడం బాగా తేడా తెచ్చేసిందట. పైగా ఇప్పుడు పవన్.. మహేష్.. బన్నీ సినిమాల్లో ఆఫర్లు వచ్చాయన్న వార్తలతో ఈ భామ ఏకంగా ఆకాశానికి ఎక్కేసిందని అంటున్నారు సినిమా జనాలు.

భారీ సినిమాలు చేతిలోకి రాగానే అమ్మడి యాటిట్యూడ్ మారిపోయిందని తెలుస్తోంది. నానితో చేస్తున్న 'నేను లోకల్' మూవీ కోసం దాదాపు చుక్కలు చూపించేస్తోందట. ఇప్పటికే 90శాతం షూటింగ్ పూర్తయిపోవడంతో.. చేయగలిగింది ఏమీ లేక సైలెంట్ అయిపోయారట హీరో కం నిర్మాత. కీర్తి కారణంగానే అనుకున్న డేట్ కి షెడ్యూల్స్ పూర్తి కాక రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చిందనేది లేటెస్ట్ టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News