• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'దసరా' పూర్తి... కీర్తి...

'దసరా' పూర్తి... కీర్తి సురేష్ ఖరీదైన బహుమానాలు

By - Tupaki Desk
Update: 2023-01-20 07:15 GMT
పాత తరంలో కొందరు స్టార్స్.. ఈ తరంలో కొందరు స్టార్స్ తాము నటిస్తున్న సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆ చిత్ర యూనిట్ సభ్యులందరికి కూడా తోచినంత ఖర్చు చేసి బహుమానాలు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ఆ మధ్య తమిళంకు చెందిన ఒక యంగ్‌ హీరో తన సినిమా యూనిట్‌ సభ్యులందరికి గోల్డ్‌ కాయిన్స్ ను ఇవ్వడం జరిగింది.

తాజాగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ కూడా అదే పద్దతిని ఫాలో అయ్యింది. నానితో కలిసి కీర్తి సురేష్ నటిస్తున్న సినిమా దసరా. ఆ సినిమాలో కీర్తి సురేష్‌ తన పోర్షన్ కు సంబంధించిన చిత్రీకరణ ముగించింది. షూటింగ్ ఆకరి రోజున కీర్తి సురేష్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు అందరికి గోల్డ్ కాయిన్స్ ను ఇచ్చిందట.

సభ్యులందరికి కూడా రెండు గ్రాముల చొప్పున గోల్డ్‌ కాయిన్స్ ను ఇచ్చి వారిని సంతోష పర్చిందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇందుకు గాను కీర్తి సురేష్ దాదాపుగా ఏడు లక్షల రూపాయలను ఖర్చు చేసిందని కూడా వారు చెబుతున్నారు.

దసరా సినిమాలో కీర్తి సురేష్ డీ గ్లామర్‌ రోల్‌ లో కనిపించబోతున్న విషయం తెల్సిందే. దసరా పై కీర్తి సురేష్‌ చాలా ఆశలు పెట్టుకుంది. సినిమా లోని తన పాత్రకు ఉన్న ప్రాముఖ్యతపై ఆమె చాలా నమ్మకం పెట్టుకుని ఉందట. అందుకే సినిమా చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత యూనిట్‌ సభ్యులకు బంగారు కాయిన్స్ ఇచ్చిందని తెలుస్తోంది.

మరో వైపు కీర్తి సురేష్‌ భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్‌ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. చిరంజీవికి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతుంది. దసరా సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే భోళా శంకర్ సినిమా షూటింగ్‌ లో కీర్తి సురేష్ జాయిన్‌ అయ్యింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Dasara 
  • KeerthySuresh 
  • NaturalStarNani 
  • ExpensiveGifts 
  • GoldCoins 
  • DasaraTeam 
  • LatestNews 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS