రాజమౌళి గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన కీరవాణి...!
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. అందుకే ఆయన దర్శకధీరుడయ్యాడు. ఆయన సినిమాల విషయంలో ఎంత పర్ఫెక్టుగా ఉంటాడో జక్కన్న సినిమాలను ఫాలో అయితే అర్థం అవుతుంది. రాజమౌళి ఒక సినిమా తీయడానికి అంత టైం తీసుకునేది ఆ సినిమా పర్ఫెక్టుగా రావడం కోసమే అంటారు ఆయన దగ్గర పని చేసిన వాళ్ళు. రాజమౌళి గురించి ఎవరికీ తెలియని విషయాలను తెలుసుకోవడానికి సినీ అభిమానులు అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో రీసెంటుగా ఒక వెబ్ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పెద్దన్న కీరవాణి జక్కన్న గురించి మనకు తెలియని కొన్ని విషయాలను బయటపెట్టాడట. తెరపై రౌద్రాన్ని ఎమోషన్ ను అద్భుతంగా పండించే రాజమౌళి.. రియల్ లైఫ్ లో మాత్రం చిన్న పిల్లల సినిమాలు ఎక్కువగా చూస్తుంటాడని కీరవాణి బయటపెట్టాడు. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలంతా 30 రోజులుగా ఇళ్లకే పరిమతమయ్యారు. ఈ నేపథ్యంలో అందరూ వీడియో కాల్స్ ద్వారా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే రాజమౌళి, చిరంజీవి లాంటి వారు కూడా పలు మీడియా సంస్థలతో లైవ్‌లో మాట్లాడుతూ ఆసక్తి విషయాలను వెల్లడించారు.
ఇప్పుడు తాజాగా కీరవాణి కూడా వీడియో కాల్ ద్వారా ఒక మీడియా ఛానల్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా తన ఫామిలీలో మెంబర్స్ లోని పాజిటివ్ అండ్ నెగటివ్ క్వాలిటీలను చెప్పారు కీరవాణి. సదరు యాంకర్ రాజమౌళి లో నచ్చేవి నచ్చనివి చెప్పమని అడుగగా.. 'రాజమౌళిలో నచ్చిన విషయం ఏంటంటే.. ఒక పని నచ్చితే దాన్ని పూర్తిచేసే వరకు వదిలిపెట్టడు. ఏకాగ్రత ఎక్కువ. నచ్చని విషయం ఏంటంటే.. ఎక్కువగా చిన్న పిల్లల సినిమాలు చూస్తుంటాడు. మెచ్యూర్డ్ సినిమాలు చూద్దాం అంటే వినడు. ఒక్కడు పక్కకెళ్లిపోయి చిన్న పిల్లల సినిమాలు చూస్తుంటాడు. నేను కొన్ని సినిమాలు చూడమని రాజమౌళికి చెప్పాను కానీ అవి ఇప్పటివరకు చూడలేదు. ఉదాహరణకు ఫారెస్ట్ గంప్ అనే సినిమా చూడమని రాజమౌళికి చెబితే చూడలేదు. ఇలా చాలా సినిమాలున్నాయి' అని చెప్పాడట కీరవాణి. ప్రస్తుతం రాజమౌళి కీరవాని ఆర్‌ఆర్ఆర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోవటంతో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. అదే సమయం లో తదుపరి చిత్రాలపై చర్చల జరపటంతో పాటు ఫ్యామిలీతో కలిసి దొరికిన సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.