ఎమోష‌న్‌.. నేను షారూఖ్ ఖాన్ అయ్యాను అంటే..!

స‌లీంఖాన్ వ‌య‌సు సంబంధ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఆయ‌న వ‌య‌సు 90 ఏళ్లు. ఫిబ్రవరి 17న మెదడులో స్వల్ప రక్తస్రావం కారణంగా ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు.;

Update: 2026-02-21 03:00 GMT

బాలీవుడ్ లెజెండరీ రైటర్ సలీం ఖాన్ ఆస్ప‌త్రిలో వెంటిలేట‌ర్‌పై ఉన్న ఈ స‌మ‌యంలో బాలీవుడ్ ఉద్వేగంతో క‌దిలిపోతున్న సంగ‌తి తెలిసిందే. స‌లీంఖాన్ ఆరోగ్య ప‌రిస్థితిని వైద్యులు ప‌ర్య‌వేక్షిస్తున్న క్ర‌మంలో కుమారులు స‌ల్మాన్ ఖాన్ ఆయ‌న సోద‌రులను క‌లిసేందుకు ప‌లువురు ఆస్ప‌త్రికి విచ్చేస్తున్నారు.

ముఖ్యంగా స‌ల్మాన్ కి క‌ష్టం వ‌చ్చిన ఈ స‌మ‌యంలో అత‌డి క్లోజ్ ఫ్రెండ్ షారూఖ్ ఖాన్ అండ‌గా నిలిచారు. ఇదే స‌మ‌యంలో షారూఖ్ ఖాన్ గతంలో స‌లీంఖాన్ గురించి చెప్పిన కృతజ్ఞతాపూర్వక మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షారూఖ్ ఖాన్ తన కెరీర్ ప్రారంభ రోజుల్లో పడిన కష్టాలను గుర్తుచేసుకుంటూ సలీం ఖాన్ కుటుంబంపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఢిల్లీ నుంచి ముంబైకి వ‌చ్చి న‌టుడిగా ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు షారూఖ్ ఖాన్‌కు సల్మాన్ ఖాన్ ఇంట్లోనే భోజనం దొరికేదని నాటి రోజుల‌ను గుర్తు చేసుకున్నారు.

నేను ఈరోజు ఇలా ఉన్నానంటే.. నేను ఈ రోజు షారూఖ్ ఖాన్ అయ్యాను అంటే.. దానికి కారణం సలీం ఖాన్ గారే. వారు ఆ రోజుల్లో నాకు అందించిన మద్దతు.. పెట్టిన అన్నం వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను! అని షారూఖ్‌ ఒక ఇంటర్వ్యూలో (2018 `దస్ కా దమ్` షో సమయంలో) ఉద్వేగంగా చెప్పారు.

సలీం ఖాన్ ఆరోగ్యంపై తాజా రిపోర్ట్ ఏమిటి?

స‌లీంఖాన్ వ‌య‌సు సంబంధ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఆయ‌న వ‌య‌సు 90 ఏళ్లు. ఫిబ్రవరి 17న మెదడులో స్వల్ప రక్తస్రావం కారణంగా ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు డిఎస్ఏ (డిజిట‌ల్ స‌బ్‌ట్రాక్ష‌న్ యాంజియోగ్ర‌ఫీ) అనే ప్రక్రియను పూర్తి చేశారు. ఎటువంటి మేజర్ సర్జరీ అవసరం లేదని.. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని డాక్టర్ జలీల్ పార్కర్ తెలిపారు. వయసు దృష్ట్యా రికవరీకి కొంచెం సమయం పట్టవచ్చని వైద్యులు పేర్కొన్నారు.

సల్మాన్ ఎందుకు రిపోర్ట్ ఇవ్వొద్దని ఆస్పత్రిని కోరారు?

త‌న తండ్రి సలీం ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు లేదా వైద్యులు నేరుగా మీడియాకు అప్‌డేట్స్ ఇవ్వడంపై సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబం అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆరోగ్యం అనేది వ్యక్తిగత విషయమని.. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా మెడికల్ బులెటిన్లు విడుదల చేయవద్దని వారు కోరారు. మీడియాలో రకరకాల ఊహాగానాలు రాకుండా ఉండాలంటే.. అప్‌డేట్స్ ఏవైనా ఉంటే కుటుంబమే నేరుగా చెబుతుందని ఆస్పత్రి యాజమాన్యానికి స్పష్టం చేశారు.

సలీం ఖాన్ త్వరగా కోలుకోవాలని అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, అమీర్ ఖాన్ వంటి తారలు కూడా ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News