అనుదీప్ ఈ లాజిక్ ఎందుకు మిస్సవుతున్నాడు?
దీంతో అనుదీప్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చాడు. ఈ ఒకే ఒక్క మూవీతో భారీ పాపులారిటీని సొంతం చేసుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు.;
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్‌కు కొదవలేదు. ఆ విషయాన్ని బక్సాఫీస్ వద్ద సందడి చేసిన ప్రతి సినిమా నిరూపిస్తూ వస్తోంది. అంతే కాకుండా పాన్ ఇండియా సినిమాలతో భారతీయ సినీ ఇండస్ట్రీని సరికొత్త ట్రాక్‌లోకి తీసుకొచ్చి సినీ పరిశ్రమని పరుగులు పెట్టిస్తున్న ఘనత మనదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ పర్సన్స్ ఈ మధ్య వరుసగా విఫలం అవుతున్నారు. ఆ జాబితాలో తాజాగా దర్శకుడు అనుదీప్ కెవీ కూడా చేరాడు. సినిమా డైలాగ్‌లని పక్కన పెట్టి వాడుక భాషలో డైలాగ్‌లని అందించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
బలమైన కథకు కామెడీని జోడించి `జాతిరత్నాలు` మూవీని రూపొందించిన తీరుకు అనుదీప్‌పై ప్రశంసల వర్షం కురిసింది. సింగిల్ లైనర్స్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేసి శభాష్ అనిపించుకున్నాడు. దీంతో ఈ మూవీ అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి మేకర్స్‌కి కాసుల వర్షం కురిపించింది. కేవలం ఆరు కోట్లతో నిర్మిస్తే రూ.70 కోట్లు రాబట్టి ఇండస్ట్రీ వర్గాలని షాక్‌కు గురి చేసింది. కేవలం చిన్న చిన్న ఆర్టిస్ట్‌లతో చేసిన ఈ సినిమాకు ఇంత పెద్ద భారీ మొత్తంలో కలెక్షన్‌లు రావడంతో అంతా అవాక్కయ్యారు.
దీంతో అనుదీప్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చాడు. ఈ ఒకే ఒక్క మూవీతో భారీ పాపులారిటీని సొంతం చేసుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు. అయితే ఆ తరువా తనుంచి ఆ క్రేజ్‌ని అనుదీప్ క్యారీ చేయలేకపోతున్నాడు. ఏదైతే తన బలమో దాన్ని మరిచి సినిమాలు చేస్తూ వరుసగా ఫ్లాపుల్ని సొంతం చేసుకుంటున్నాడు. బలమైన కథకు తనదైన మార్కు సింగిల్ లైనర్స్ తోడైతే సినిమా ఫలితం మరోలా ఉంటుంది. ఈ లాజిక్‌ని మిస్సవుతూ నేల విడిచి సాము చేసినట్టుగా కథని, కథనాన్ని పక్కన పెట్టి కేవలం సింగిల్ లైనర్స్‌నే నమ్ముకుంటున్నాడు.
ఫలితంగా ఫ్లాప్ అవుతున్నాడు. ఇదే విషయం తను రూపొందించిన `ప్రిన్స్` మూవీ నిరూపించింది. శివకార్తికేయన్ హీరోగా ఉక్రెయిన్ భామ మరియా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ డైలాగ్స్, సింగిల్ లైనర్స్‌గా బాగున్నా బలమైన కథ, కథనాల విషయంలో విఫలమై ఫ్లాప్‌గా మిగిలింది. అదే బలమైన కథని ఎంచుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది. దీన్ని గమనించని అనుదీప్ `ఫంకీ` విషయంలోనూ అదే తప్పు చేశాడు. విశ్వక్‌సేన్‌తో చేసిన ఈ మూవీలో అసలు కథే లేకపోవడం ప్రేక్షకుల్ని షాక్‌కు గురి చేసింది.
ఫలితం భారీ డిజాస్టర్ అనిపించుకుంది. దీంతో అనుదీప్ కథని పక్కన పెట్టి కేవలం వన్ లైనర్స్‌ని నమ్ముకుని సినిమా చేశాడనే కామెంట్‌లు మొదలయ్యాయి. రియల్ లైఫ్‌లో ఫుల్ ఫన్ గయ్‌గా పేరున్న అనుదీప్ తనదైన టైమింగ్‌కి మంచి కథలు తోడైతే బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకోవడం ఏమంత పెద్ద విషయమేమీ కాదని, ఈ లాజిక్‌ని అనుదీప్ ఎందుకు మిస్సవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికైనా తన బలం ఏంటో తెలుసుకుని అనుదీప్ పంథా మార్చుకుంటే `జతారత్నాలు` లాంటి అద్భుతాలు సృష్టిస్తాడనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. మరి అనుదీప్ మారతాడా?.