స్క్రీన్ మీద మాత్రమే కాదు… ప్లానింగ్‌లో కూడా యష్ టాక్సికే..!
ఇవే కాకుండా.. ఒక ప్రముఖ తమిళ దర్శకుడితో యష్ కొత్త సినిమా చేయనున్నారని సమాచారం. ఇది పూర్తిగా డిఫరెంట్ స్టోరీతో ఉండబోతుందట.;
ఇప్పుడు ఇండియన్ సినిమా గురించి మాట్లాడితే పాన్ ఇండియా..అనే మాట చాలా కామన్ అయిపోయింది. అన్ని భాషల ప్రేక్షకులను.. ఒకే సినిమాతో ..థియేటర్లకు తీసుకువచ్చే హీరోలు ఇప్పుడు ఎక్కువయ్యారు. కానీ ఈ రేస్‌లో సైలెంట్‌గా, స్ట్రాంగ్ ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్న హీరో యాష్ అంటూ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఒక వాదన వినిపిస్తోంది.
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన యష్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన సినిమా కే.జి.ఎఫ్. కే.జి.ఎఫ్ చాప్టర్ 1 సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో ఈ హీరో పేరు మార్మోగింది. ఆ తర్వాత వచ్చిన KGF: Chapter 2 అయితే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. ఈ రెండు సినిమాలతో యష్ స్టార్‌డమ్ ఒక్కసారిగా ఆకాశానికి వెళ్లిపోయింది.
కే.జి.ఎఫ్ తర్వాత యష్ వరుసగా సినిమాలు చేయలేదు. చాలా టైమ్ తీసుకుని కథలు ఎంచుకున్నాడు. అదే ఇప్పుడు ఆయనకు ప్లస్ అవుతోంది. ప్రస్తుతం యష్ రాబోయే సినిమాల లైనప్ చూసి ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.
మొదటగా చెప్పుకోవాల్సిన సినిమా టాక్సిక్. ఈ సినిమాకు వచ్చిన టీజర్‌తోనే భారీ హైప్ క్రియేట్ అయింది. యష్ కెరీర్‌లో ఇది పూర్తిగా కొత్త తరహా సినిమా అని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమా మార్చి 19న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
దీని తర్వాత యష్ చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ రామాయణ పార్ట్ 1. ఇందులో యష్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇది చాలా పవర్‌ఫుల్, ఛాలెంజింగ్ రోల్ అని అంటున్నారు. ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది. అలాగే రామాయణ పార్ట్ 2ను 2027 దీపావళికి ప్లాన్ చేస్తున్నారు.
ఇవే కాకుండా.. ఒక ప్రముఖ తమిళ దర్శకుడితో యష్ కొత్త సినిమా చేయనున్నారని సమాచారం. ఇది పూర్తిగా డిఫరెంట్ స్టోరీతో ఉండబోతుందట. అలాగే అభిమానులను ఇంకా ఎక్సైట్ చేస్తున్న విషయం ఏంటంటే KGF: Chapter 3 వచ్చే ఛాన్స్ కూడా ఉందని ఇండస్ట్రీలో టాక్. ఇన్ని భారీ ప్రాజెక్ట్స్ ఒకే హీరో లైనప్‌లో ఉండటం చాలా అరుదు. అందుకే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం యష్ వైపు చూస్తోంది.
రాబోయే రోజుల్లో పాన్ ఇండియా రేస్‌లో యష్ పేరు ఇంకా బలంగా వినిపించడం ఖాయం. ఇక కొంతమంది ఈ దూకుడు చూసి ఈ హీరో స్క్రీన్ పైన కాదు.. నిజజీవితంలో కూడా ఇంత తో టాక్సిక్ గా ఉన్నారేంటి.. వరుసగా ఇన్ని పాన్ ఇండియా సినిమాలు ఒప్పుకున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.