• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  24 గంట‌ల షోల‌తో రికార్డుల...

24 గంట‌ల షోల‌తో రికార్డుల మోత‌!

By - Tupaki Desk
Update: 2018-10-12 09:28 GMT
గ‌త కొంత‌కాలంగా మ‌ల‌యాళ హిస్టారిక‌ల్ మూవీ `కాయంకుల‌మ్ కొచ్చున్ని` గురించిన ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. యువ‌హీరో నివిన్ పాళీ న‌టించిన భారీ చారిత్ర‌క చిత్ర‌మిది. ఆంగ్లేయుల కాలంలో నాడు కేర‌ళ‌కు చెందిన కొంద‌రు దొంగ‌లు చేసిన విరోచిత పోరాటం నేప‌థ్యంలో చిత్రీక‌రించిన మూవీ ఇది. ఈ సినిమా ఎన్టీఆర్ `అర‌వింద స‌మేత‌` రిలీజైన రోజే అంటే అక్టోబ‌ర్ 11న కేర‌ళ వ్యాప్తంగా రిలీజైంది. దాదాపు 350 కేంద్రాల్లో ఈ చిత్రాన్ని అత్యంత క్రేజీగా రిలీజ్ చేశారు.

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఎవ‌రూ చేయ‌ని ప్ర‌యోగం ఈ సినిమా కోసం నిర్మాత‌లు చేశారు. 24 గంట‌ల మార‌థాన్ పేరుతో `కాయంకుల‌మ్ కొచ్చున్ని` చిత్రాన్ని ప్రివ్యూలు ప్ర‌దర్శించారు. దీంతో ఈ సినిమా మ‌ల్లూవుడ్‌ లో ప‌లు ఓపెనింగ్‌ రికార్డుల్ని బ్రేక్ చేసి స‌త్తా చాటింది. అధికారిక స‌మాచారం ప్ర‌కారం 3.5 కోట్ల వ‌ర‌కూ ప్రీమియ‌ర్ల‌తో డే1 వ‌సూలు చేసింద‌ని చెబుతున్నా ఈ చిత్రం 5 -6కోట్ల మ‌ధ్య‌లో వ‌సూలు చేసి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ వ‌సూళ్లు  `ది గ్రేట్ ఫాద‌ర్` వ‌సూళ్ల‌ను మించి ఉంటుంద‌ని - మోహ‌న్ లాల్ న‌టించిన `మ‌న్యం పులి` (పులి మురుగ‌న్) రికార్డులు బ్రేక్ చేయ‌నుంద‌ని విశ్లేషిస్తున్నారు.

రిలీజ్ ముందు ఈ సినిమాకి బోలెడంత హైప్‌ ని క్రియేట్ చేయ‌డంతో ఓపెనింగుల‌కు ఇది క‌లిసొచ్చింది. ఇక రివ్యూలు డీసెంట్ గా రావ‌డంతో ఈ చిత్రం ఈ వీకెండ్ బాగానే వ‌సూలు చేస్తుంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ ఓ అతిధి పాత్ర‌లోనూ మెరిశారు. లాల్ - నివిన్ పాళీ కాంబినేష‌న్‌ లోని ఓ మాస్ అవ‌తార్ స‌న్నివేశం ట్రైల‌ర్‌ లోనూ ఆక‌ట్టుకుంది. ఆ క్ర‌మంలోనే ఓపెనింగుల‌కు ఈ ప్ర‌చార ఎత్తుగ‌డ క‌లిసొచ్చింద‌ని అంటున్నారు. అలానే 24 గంట‌ల మార‌థాన్ వ్య‌వ‌స్థ ఓపెనింగుల‌కు బాగా అక్క‌రకొచ్చింది. టాలీవుడ్‌తో పోలిస్తే మ‌ల్లూవుడ్ బ‌డ్జెట్‌లు ఎంతో ప‌రిమితం. అయినా భారీ వ‌సూళ్లు సాగిస్తుంటాయి. ఇక మోహ‌న‌ల్ లాల్ క్రేజుతో ఈ చిత్రాన్ని తెలుగు వెర్ష‌న్ రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.
    

Tags:    
  • Kayamkulam Kochunni 
  • Movie marathon 
  • Kerala 
  • TElugu NEWs 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS