• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పరాన్నజీవి'లో కత్తి...

'పరాన్నజీవి'లో కత్తి మహేష్ రోల్ అదేనా...?

By - Tupaki Desk
Update: 2020-07-23 10:50 GMT
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి పై సెటైరికల్ మూవీగా ''పరాన్నజీవి'' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పై తీస్తున్న ''పవర్ స్టార్'' సినిమాకి కౌంటర్ గా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి 'బిగ్ బాస్' కంటెస్టెంట్ నూతన్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 'పరాన్నజీవి' టైటిల్ సాంగ్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో ఆర్జీవీ పాత్రలో జబర్ధస్త్ కమెడియన్ షకలక శంకర్ నటిస్తున్నాడు. ఇప్పటికే షకలక శంకర్ ఫస్ట్ లుక్ తో పాటు కత్తి మహేష్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ ను రిలీజ్ చేశారు. 'మహేష్ కత్తి - ది పీకే ఫ్యాన్' అంటూ రిలీజైన ఈ పోస్టర్ లో కత్తి మహేష్ జేబుపై పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండటం విశేషం.

కాగా కత్తి మహేష్.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'పవర్ స్టార్' సినిమాలో కూడా నటిస్తున్నాడు. ''వర్మ తీసిన.. వర్మపై తీసిన సినిమాలలో ఉన్న ఏకైక యాక్టర్ నేనే'' అని మహేష్ కత్తి ప్రకటించారు. నిన్న రిలీజైన 'పవర్ స్టార్' ట్రైలర్ లో కూడా మహేష్ జర్నలిస్ట్ పాత్రలో ప్రవన్ కళ్యాణ్ ని ఇంటర్వ్యూ చేస్తూ కనిపించాడు. ఇప్పుడు లేటెస్టుగా కత్తి మహేష్ నగలు ధరించిన ఫోటో పెట్టి ''ఈ మాత్రం నగలు దిగేసుకుంటే కానీ నిర్మాత అనరంట.. సరే అలాగే కానిద్దాం'' అని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ఈ గెటప్ 'పరాన్నజీవి' సినిమాలోనిదని అర్థం అవుతోంది. అంతేకాకుండా మహేష్ గెటప్ చూస్తే టాలీవుడ్ ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గుర్తుకు రాకమానడు.

తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కూడా రెండు చేతి వేళ్ళకి ఉంగరాలుతో పాటు మెడలో ఎప్పుడూ బంగారు గొలుసుతో తో కనిపిస్తారు. అందులోనూ ఈయన రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన 'ఐస్ క్రీమ్' సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించారు. దీంతో కత్తి మహేష్ 'పరాన్నజీవి'లో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ రోల్ ప్లే చేయబోతున్నాడని సినీ అభిమానులు డిసైడ్ అయ్యారు. కానీ కత్తి మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మాత్రం పీకే ఫ్యాన్ అని పరిచయం చేసారు. మరి ఈ సినిమాలో ప్రొడ్యూసర్స్ అంటే ఇలా నగలు ధరించి రిచ్ గా కనిపించాలని అలా ప్లాన్ చేశారా లేదా సత్యనారాయణని పోలిన పాత్రనే చూపిస్తున్నారా అనేది తెలియాలంటే 'పరాన్నజీవి' రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే. ఇక 'పవర్ స్టార్' 'పరాన్నజీవి' సినిమాలు రెండూ జూలై 25న ఉదయం 11 గంటలకు ఆన్లైన్ లో విడుదల కానున్నాయి.
Tags:    
  • Kathi Mahesh 
  • Paranna Jeevi 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS