కథలో రాజకుమారి ఎప్పుడొస్తుందంటే..

Update: 2017-05-28 10:18 GMT
గత ఏడాది ప్రథమార్ధంలో వరుసగా ఎదురు దెబ్బలు తిన్నాడు నారా రోహిత్. తుంటరి.. సావిత్రి.. రాజా చెయ్యి వేస్తే అతడికి నిరాశనే మిగిల్చాయి. కానీ ఏడాది చివర్లో రెండు మంచి సినిమాలతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు నారా వారబ్బాయి. వేరే హీరోలతో అతను తెరను పంచుకున్న ‘జ్యో అచ్యుతానంద’.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ మంచి విజయం సాధించాయి. ఇప్పుడు రోహిత్ నుంచి రాబోతున్న ‘కథలో రాజకుమారి’ మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ విలక్షణ సినిమా.. టైటిల్ లోగో.. ఫస్ట్ లుక్ పోస్టర్.. టీజర్‌ లతో ఆకట్టుకుంది. టీజర్ రిలీజయ్యాక వార్తల్లో లేని ఈ సినిమా.. ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రకటనతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

‘కథలో రాజకుమారి’ని జూన్ 30న ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. త్వరలోనే ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఇది సినీ నేపథ్యంలో సాగే సినిమా అని.. అంటున్నారు. రోహిత్ సరసన ‘చుట్టాలబ్బాయి’ ఫేమ్ నమిత ప్రమోద్ నటిస్తున్న ఈ చిత్రంలో నాగశౌర్య.. నందిత ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాతో పాటు ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో మంచి గుర్తింపు సంపాదించిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాను నిర్మించిన కృష్ణ విజయ్.. ప్రశాంతిలతో పాటు సౌందర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News