• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హిందీ 'ఖైదీ'కి సూపర్‌...

హిందీ 'ఖైదీ'కి సూపర్‌ స్టార్‌ ఆసక్తి

By - Tupaki Desk
Update: 2020-02-11 08:15 GMT
గత సంవత్సరం కార్తీ ‘ఖైదీ’ చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. విభిన్నమైన నేపథ్యంలో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ‘ఖైదీ’ చిత్రాన్ని తెరకెక్కించాడు. తమిళంతో పాటు తెలుగులో డబ్‌ అయ్యి ఇక్కడ కూడా మంచి టాక్‌ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈమద్య కాలంలో సౌత్‌ లో సక్సెస్‌ అయిన సినిమాలు హిందీలో రీమేక్‌ అవ్వడం చాలా కామన్‌ అయ్యింది. ఇప్పుడు ఖైదీని కూడా రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తమిళంలో ఒక మీడియం రేంజ్‌ హీరో అయిన కార్తీ చేసిన సినిమా కనుక బాలీవుడ్‌ లో కూడా మీడియం రేంజ్‌ హీరోతోనే చేస్తారేమో అనుకున్నారు. కాని ఖైదీ రీమేక్‌ పై బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ ఆసక్తి చూపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన పేరు ఖైదీ రీమేక్‌ చర్చల్లో వినిపిస్తుంది. వార్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత హృతిక్‌ రోషన్‌ మళ్లీ అదే స్థాయి యాక్షన్‌ సినిమాను చేయాలనుకుంటున్నాడు. అందుకే ఖైదీ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట.

హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ స్క్రిప్ట్‌ ను మార్చితే తప్పకుండా ఆయన నటిస్తాడని అంటున్నారు. ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ ను దక్కించుకున్న నిర్మాణ సంస్థతో గతంలో హృతిక్‌ రోషన్‌ సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడని.. ఆ ఒప్పందం ప్రకారం ఇప్పుడు ఖైదీ రీమేక్‌ కు ఒప్పుకునే అవకాశం ఉందంటూ బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. హృతిక్‌ రోషన్‌ ఓకే అయితే సమ్మర్‌ లో షూటింగ్‌ షురూ అయ్యే అవకాశం ఉంది.

ఒరిజినల్‌ వర్షన్‌ కు దర్శకత్వం వహించిన లోకేష్‌ ను అక్కడ చేయించేందుకు ప్రయత్నాలు చేశారు. కాని లోకేష్‌ హిందీ రీమేక్‌ పై ఆసక్తి చూపడం లేదట. ప్రస్తుతం విజయ్‌ తో ఈయన మాస్టర్‌ చిత్రాన్ని చేస్తున్నాడు. కనుక హిందీ ఖైదీ కోసం మరో దర్శకుడిని టీం ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతోంది. హృతిక్‌ ఓకే చెప్తే ఆయన చెప్పే దర్శకుడితోనే రీమేక్‌ చేసే అవకాశం ఉంది.
Tags:    
  • Karthi superhit film to get remade in Hindi 
  • Kollywood 
  • Kollywood News 
  • Bollywood 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS