తన కంటే చిన్నవాడి పక్కన కరీనాకపూర్‌!

Update: 2015-05-25 09:30 GMT
అర్జున్‌ కపూర్‌ 1985 బర్త్‌. కరీనా కపూర్‌ అధికారిక జన్మదినం 1980లో ఉంటుంది. అంటే స్థూలంగా అర్జున్‌ కపూర్‌ కరీనా కన్నా ఐదు సంవత్సరాల చిన్నవాడు. అయితేనేం.. వీళ్లు ఎంచక్కా జతకట్టబోతున్నారు. ఒక సినిమాలో కలిసి నటించబోతున్నారు.

    అర్జున్‌ కపూర్‌, కరీనా కపూర్‌లు హీరోహీరోయిన్లుగా ఆర్‌.బాల్కి తన తదుపరి సినిమాను షురూ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే 'షమితాబ్‌' సినిమాతో నిరాశ పరిచిన ఈ దర్శకుడు మరో వైవిధ్యమైన సినిమాను చేయనున్నట్టుగా తెలుస్తోంది.

    మరి అర్జున్‌, కరీనాలు జంటగా నటించడం అనేది చాలా ఆసక్తికరమైన విషయం.అయితే బాలీవుడ్‌లో ఇలా కుర్ర హీరోల పక్కన.. కాస్త ముతక హీరోయిన్లు నటించడం అనేది కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలా చిన్న వయసులోని హీరో పక్కన పెద్ద వయసులోని హీరోయిన్లు నటించడం జరిగింది.

    ఇప్పుడు అర్జున్‌, కరీనాలతో ఆ ఫీటు మళ్లీ రిపీట్‌ అవుతోంది. కరీనా అర్జున్‌ కన్నా వయసులో పెద్దది అయినా.. నాజుకైన శరీరంతో ఉంటుంది కాబట్టి.. తెరపై అతడి కన్నా చిన్నదిగా కనపడగలదు కదా!


Tags:    

Similar News