మాతృత్వంపై బెబో పుస్త‌కం రియ‌ల్లీ స‌ర్ ప్రైజ్

Update: 2021-07-09 17:30 GMT
ప‌టౌడీ సంస్థాన కోడ‌లు .. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌రీనా క‌పూర్ తాజాగా త‌న బేబి బంప్ కి సంబంధించిన ఓ హిడెన్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేయ‌గా అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇద్ద‌రు పిల్ల‌ల మ‌మ్మీగా బెబో మాతృత్వాన్ని ఆస్వాధిస్తూ ఇటీవ‌లే ఓ పుస్త‌కాన్ని రాసారు. మిసెస్ కపూర్ ఖాన్ తన సొంత పుస్తకాన్ని ``కరీనా కపూర్ ఖాన్ గర్భధారణ బైబిల్`` పేరుతో లాంచ్ చేశారు. అందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌తో పాటు.. అన్ సీన్ ఫోటోని షేర్ చేశారు.

కరీనా కపూర్ భారీ బంప్ ఫోటో అభిమానుల‌కు రియ‌ల్ స‌ర్ ప్రైజ్ అనే చెప్పాలి. క‌రీనా రెండుసార్లు గ‌ర్భిణిగా ఉన్న‌ప్పుడు బేబి బంప్ ఫోటోల‌ను షేర్ చేశారు. తన మొదటి బిడ్డ తైమూర్ తో గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె శరీరంలోని అన్ని మార్పుల గురించి జీవ‌న శైలి గురించి వివ‌రించారు. ఆ త‌ర్వాత ఇటీవ‌లే త‌న రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డానికి ముందు బేబి బంప్ ఫోటోల‌ను షేర్ చేసారు.

ఇంత‌లోనే కరీనా కపూర్ ఖాన్ `గర్భధారణ బైబిల్` పేరుతో తన మొట్టమొదటి పుస్తకాన్ని ప్రారంభించారు.  ఇన్ స్టాలో ఈ రోజు ఈ ఆశ్చర్యకరమైన ప్రకటన చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. తన రెండవ కొడుకుతో గర్భవతిగా ఉన్నప్పుడు క్లిక్ చేసిన ఫోటోని షేర్ చేయ‌గా అభిమానులు ఆశ్చ‌ర్య‌పోయారు.

ఈ ఫోటోతో పాటు కొన్ని విష‌యాల‌ను క‌రీనా షేర్ చేశారు. మనమందరం తల్లులుగా ఎవ‌రికి వారు ప్రత్యేక అనుభవాలను కలిగి ఉన్నాం. కానీ కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఈ పుస్తకంతో నేను నా అనుభవాలను నేర్చుకున్న విష‌యాల‌ను పంచుకుంటున్నాను. మాతృత్వం వైపు మీ ప్రయాణంలో ఇది మీకు సహాయం చేస్తుంది. నా బిడ్డలను పెంచ‌డం నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన అనుభూతిని క‌లిగిస్తోంది. మీతో ఈ అరుదైన క్షణాలు జ్ఞాపకాలను పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను`` అని క‌రీనా తెలిపారు.

ఇన్ స్టాగ్రామ్ లోని మరో పోస్ట్‌లో కరీనా గర్భధారణ సమయంలో తాను చేసిన పోరాటాలపైనా కొన్ని విష‌యాల్ని నొక్కి చెప్పింది. మంచి రోజులు చెడు రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు నేను పనికి వెళ్తున్నాను.. మరికొన్ని సార్లు నేను మంచం నుండి బయటపడటానికి చాలా కష్టపడ్డాను. ఈ పుస్తకం నేను గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ప్ప‌టి ప‌రిస్థితిపై వివ‌ర‌ణ ఇది. శారీరకంగా మానసికంగా అనుభవించిన చాలా విష‌యాల‌ను వెల్ల‌డిస్తున్నాను`` అని పేర్కొంది.

కరీనా తన రెండవ శిశువు పేరును ఇంకా వెల్లడించలేదు. కానీ  తన బిడ్డ బంప్ ఫోటోని ఆనందంగా షేర్ చేస్తూ.. ఫోటో తీసినందుకు సెలెబ్ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠాకు కృతజ్ఞతలు తెలిపారు.
Tags:    

Similar News