పెళ్లికి ఎక్స్‌ గాళ్‌ఫ్రెండ్స్‌ని పిలవనేలేదు

Update: 2015-06-30 17:30 GMT
లవర్‌బోయ్‌, చాక్లెట్‌బోయ్‌ షాహిద్‌ కపూర్‌ ఓ ఇంటివైడైపోతున్నాడు. ముందే ప్రకటించినట్టే కాలేజీ అమ్మాయి, ఢిల్లీకి చెందిన మీరా రాజ్‌పుత్‌ని పెళ్లాడేస్తున్నాడు.  మూడుముళ్ల బంధంతో ఏకం కావడానికి ఇంకా ఏడురోజులే గడువు. జూలై 7న తాళికట్టు శుభవేళకు అంతా రెడీ అవుతోంది. అయితే ఈ పెళ్లి చాలా సాదాసీదాగా జరుగుతోంది. వేడుకకు కేవలం కొద్దిమంది సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే హాజరవుతారు. భారీగా తారాగణం, సెలబ్రిటీల సందడి ఉండదని చెబుతున్నారు.

అంతేనా ఈ వివాహానికి సంబంధించి ఓ రెండు హాట్‌ టాపిక్స్‌ బాలీవుడ్‌లో హైలైట్‌ అయ్యాయి. పెళ్లికి షాహిద్‌ మాజీ లవర్‌ కరీనాకపూర్‌ వస్తుందా? రాదా? అన్న హాట్‌ టాపిక్‌ బాలీవుడ్‌లో నడుస్తోంది. ఓ రకంగా బెబో వచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు. అలాగే షాహిద్‌ తనకంటే చిన్న వయసు ఉన్న అమ్మాయిని పెళ్లాడుతున్నాడే అన్న టాపిక్‌ కూడా నడుస్తోంది. అయితే దీనికి సమాధానంగా మాధురి ధీక్షిత్‌ వివాహాన్ని చెబుతున్నారు. మాధురి తనకంటే బాగా వయసులో పెద్దవాడైన డాక్టర్‌ నీనేని పెళ్లాడినట్టే మీరా రాజ్‌పుత్‌ తనకంటే రెట్టింపు వయసున్న షాహిద్‌ని మనువాడడానికి రెడీ అయ్యింది. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి. పైవాళ్ల దీవెనలతోనే అన్నీ.. అదీ సంగతి.

Tags:    

Similar News