ఇకపై తండ్రి పాత్రలకు నేను సిద్ధం: ప్రముఖ డైరెక్టర్
బాలీవుడ్ అగ్ర దర్శకనిర్మాత కరణ్ జోహార్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేయడమే కాదు.. పలు సక్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాతగా.. డిస్ట్రిబ్యూటర్‌గా కరణ్ జోహార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు తెలుగులో రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ చిత్రాన్ని ఆయనే హిందీలో రిలీజ్ చేశారు. కరణ్ జోహార్ దర్శక, నిర్మాతగానే కాకుండా పలు చిత్రాల్లో కూడా అడపాదడపా నటించారు. తాజాగా కరణ్ ఓ సంచలన నిర్ణయం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో యాడ్ చేసి పోస్ట్ చేశారు. ఇందులో కరణ్ కళ్లజోడు పెట్టుకొని తెల్లగా నెరసిపోయిన జుట్టుతో సెల్ఫీ దిగారు. ‘ప్రస్తుతం ఉన్న వైరస్ కంటే నా నటన చాలా భయంకరంగా ఉంటుందని తెలుసు. కానీ, రెండో అవకాశం కోసం చూడటం ఏమాత్రం హానికరం కాదు.
అందుకే దర్శకనిర్మాతలకు ఒక ప్రకటన చేస్తున్నాను. ప్రేక్షకులను అలరించడానికి నేను తండ్రి పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ ఆయన కామెంట్ టాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరణ్ పోస్ట్ చేసిన ఫొటోపై సినీ ప్రముఖులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మీ మెయింటెనెన్స్ హీరోయిన్ కంటే ఎక్కువగా ఉంటుంది’ అని దర్శకనిర్మాత ఫరాఖాన్ సరదాగా కామెంట్ చేశారు. ‘చక్కటి ఫోటో పోజ్‌తో ఓ ఫాదర్’ అంటూ హీరోయన్ కృతి సనన్ కామెంట్ చేశారు. అదేవిధంగా మీ లుక్ బాగుందని నటి శిల్పాశెట్టి ట్వీట్ చేశారు. కరణ్ చివరగా ‘బాంబే వెల్వెట్’ చిత్రంలో కనిపించారు. అదేవిధంగా షారూఖ్‌ఖాన్ హీరోగా నటించిన ‘దిల్‌వాలే దుల్హానియా లే జయేంగే’ సినిమాలో కరణ్ నటించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ ముందు వరకు సెలూన్‌కు వెళ్లి నెత్తికి నల్లరంగు వేసుకొనేవాణ్ణి. తాజాగా లాక్‌డౌన్ కారణంగా అన్ని సెలూన్స్ షాప్స్ ఏవి తెరవకపోవడంతో.. నా నెత్తిన ఉన్న నల్లని జుట్టు కాస్త తెల్లగా మారిపోయిందంటూ సరదాగా చెప్పుకొచ్చాడు.