ఒక‌వైపు వెబ్ సిరీస్ పార్ట్ -4 మ‌రోవైపు స్వీక్వెల్!

`మిర్జాపూర్: ది మూవీ` రూపంలో చేసిన ప్రయోగం ఊహించని రీతిలో వర్కవుట్ కావడమే ఈ ఊపుకు ప్రధాన కారణం.

Update: 2026-09-15 00:30 GMT

అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలన విజయం సాధించిన `మిర్జాపూర్` క్రైమ్ డ్రామా ఫ్రాంచైజీ సరికొత్త చరిత్ర సృష్టిం చేందుకు సిద్ధమవుతోంది. ఒకవైపు వెబ్ సిరీస్ నాల్గవ సీజన్ పనులు శరవేగంగా జరుగుతుండగానే.. మరోవైపు ఇటీవల విడుదలైన థియేట్రికల్ మూవీ `మిర్జాపూర్`కు సీక్వెల్ పనులను కూడా మేకర్స్ షురూ చేశారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో పాటు వెండితెరపై కూడా సమాంతరంగా పంకజ్ త్రిపాఠి, ఆలీ ఫజల్ ల పాత్రల సాహసాలను చూపించేందుకు నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

`మిర్జాపూర్: ది మూవీ` రూపంలో చేసిన ప్రయోగం ఊహించని రీతిలో వర్కవుట్ కావడమే ఈ ఊపుకు ప్రధాన కారణం. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కొన్ని రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద దాదాపు 200 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఓటీటీ సిరీస్‌ను బిగ్ స్క్రీన్‌పై తెచ్చినా? ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ సినిమా వసూళ్లు నిరూపించాయి. దీంతో నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ `మిర్జాపూర్: ది మూవీ 2` పై దృష్టి సారించింది.

బిగ్ స్క్రీన్ సీక్వెల్ పనులను వేగవంతం చేసేందుకు వచ్చే వారం ఓ కీలకమైన భేటీ జరగనుంది. చిత్ర దర్శకుడు గుర్మీత్ సింగ్, రచయిత పునీత్ కృష్ణలతో పాటు ప్రధాన నటీనటులు, నిర్మాతలు ఫర్హాన్ అక్తర్ , రితేష్ సిధ్వానీని కలవనున్నారు. ఈ సమావేశంలో సీక్వెల్‌కు సంబంధించిన కథాంశం, స్క్రిప్ట్ పరిణామాలు , ప్రొడక్షన్ షెడ్యూల్‌పై విస్తృతంగా చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు.

వాస్తవానికి `మిర్జాపూర్` ప్రపంచాన్ని వెబ్ సిరీస్ రూపంలోనే కొనసాగించాలని నిర్మాతలు మొదట భావించారు. అయితే థియేట్రికల్ వెర్షన్‌కు లభించిన ఆదరణ మేకర్స్ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. ఓటీటీ సబ్‌స్క్రైబర్లతో పాటు థియేటర్లకు వచ్చే సాధారణ ప్రేక్షకులు కూడా గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఆస్వాదిస్తున్నారని గ్రహించిన టీమ్, బిగ్ స్క్రీన్ అనుభూతిని అందించేలా సీక్వెల్ కథను సిద్ధం చేస్తోంది.

ఈ పరిణామంతో `మిర్జాపూర్` యూనివర్స్ ఇప్పుడు సరికొత్త మోడల్‌లోకి అడుగుపెడుతోంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే `మిర్జాపూర్ సీజ‌న్ 4 - థియేటర్లలో విడుదలయ్యే సీక్వెల్ సినిమాలు ఒకదానికొకటి పూరకంగా, సమాంతరంగా సాగనున్నాయి. అయితే రిలీజ్ ఎలా ప్లాన్ చేస్తారు? అన్న‌ది కీల‌కం. ముందుగా ఓటీటీ లో సీజ‌న్ 4 రిలీజ్ కే అవ‌కాశం ఉంది. అక్క‌డ సీరిస్ కు స‌క్సెస్ అవ్వాల్సిందే. ఎందుకంటే థియేట్రిక‌ల్ గా ఇప్ప‌టి నుంచే ప‌నులు మొద‌లు పెడుతున్నారు కాబ‌ట్టి స‌క్సెస్ అనివార్యం. అక్క‌డ ఏమాత్రం ఫ‌లితం అటు ఇటు అయినా? ఆ ప్ర‌భావం సీక్వెల్ పై ప‌డుతుంది. అప్పుడు సినిమా రిలీజ్ చేయాలా? వ‌ద్దా? అన్న గంద‌ర‌గోళం ఏర్ప‌డుతుంది. ఈనేప‌థ్యంలో మేక‌ర్స్ కంటెంట్ పై న‌మ్మ‌కంతో ఆదిత్య‌ధ‌ర్ `ధురంధ‌ర్` త‌ర‌హాలో వెళ్లాల్సి ఉంటుంది.

Tags:    

Similar News