వర్మ గురించి ఇలాంటి మాటలు విని ఎంత కాలమైందో
రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు మంచి దర్శకుడు.. ఆయన టాలీవుడ్ కు కొత్త ట్రెండ్ ను పరిచయం చేసిన దర్శకుడు.. ఆయన తెలుగు నుండి వెళ్లి బాలీవుడ్ లో అద్బుత సినిమాలు ఆవిష్కరించి తెలుగు వారు గర్వించేలా చేశాడు అంటూ వర్మ గురించి గతంలో చాలా మంది చెప్పుకునే వారు. ఆయన గొప్పతనం గురించి చాలా మంది అప్పట్లో అనుకునే వారు. ఇండస్ట్రీకి చెందిన వారు ముఖ్యంగా వర్మను ఆదర్శంగా తీసుకుంటామంటూ చెప్పే వారు. కాని ఇప్పుడు పూర్తి రివర్స్ అయ్యింది. వర్మ గురించి ఎవరైనా పాజిటివ్ గా మాట్లాడితే వారు కూడా తేడానే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
తనకు సంబంధం ఉన్నా లేకున్నా కూడా అన్ని విషయాలపై స్పందిస్తూ ఎప్పుడు ఏదో ఒక వివాదం కోసం వెదికే వర్మ గురించి ఈమద్య కాలంలో మంచి మాటలే వినలేదు. ముఖ్యంగా ప్రముఖ ఫిల్మ్ మేకర్స్ వర్మ గురించి మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు. అలాంటిది బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వర్మపై ప్రశంసలు కురిపించి ఆకాశానికి ఎత్తాడు. వర్మ లాంటి వ్యక్తిని తన 25 ఏళ్ల సినీ కెరీర్ లో చూడలేదంటూ కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా ఇండియా మొత్తం మారుమ్రోగిపోతున్నాయి.
ఇంతకు వర్మ అంత మంచి వాడు అని కరణ్ జోహార్ ఎందుకు కితాబు ఇచ్చాడో తెలుసా.. చాలా ఏళ్ల క్రితం వర్మ దర్శకత్వంలో భూత్ చిత్రం వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. మళ్లీ ఇప్పుడు అదే టైటిల్ తో విక్కీ కౌశల్ హీరోగా కరణ్ జోహార్ సినిమా నిర్మించాడు. మొదట ఈ చిత్రంకు టైటిల్ గా భూత్ ను పెట్టాలనుకున్నప్పుడు వర్మ నుండి ఎలాంటి స్పందన వస్తుందో అనే అనుమానంను కరణ్ జోహార్ తో పాటు ఇతర యూనిట్ సభ్యులు వ్యక్తం చేశారట.
ఒకసారి అడిగితే ఏమవుతుందనుకుని వర్మకు ఫోన్ చేసి తమ సినిమా కథ వినిపించి భూత్ టైటిల్ కావాలని అడిగాడట. మరో మాట ఆలోచించకుండా నేను చేసిన ఏ సినిమా టైటిల్ అయినా తీసుకో.. ఎక్కడ సంతకం పెట్టమన్నా పెడతాను అంటూ ఒక్క మాటతోనే చెప్పేశాడట. అడిగిన వెంటనే భూత్ టైటిల్ ను ఇచ్చినందుకు వర్మకు థ్యాంక్స్ అంటూనే అలాంటి వ్యక్తిని ఇన్నేళ్ల కెరీర్ లో చూడలేదని కరణ్ జోహార్ అన్నాడు. మొత్తానికి చాలా కాలం తర్వాత వర్మ గురించి ఒక స్టార్ ఫిల్మ్ మేకర్ చాలా పాజిటివ్ గా స్పందించడం వర్మ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది.