ఒక్కడన్నా యాక్టింగ్‌ ఛాన్సిస్తే ఒట్టు

Update: 2016-02-11 19:30 GMT
ఇతగాడేమో ఒక టాప్‌ ప్రొడ్యూసర్‌. అలాగే ఒక సూపర్బ్‌ డైరక్టర్‌. చేతిలోకి డైరక్షన్‌ తీసుకున్నాడంటే.. బాక్సాఫీస్‌ దగ్గర కాసులు కురవాల్సిందే. అతడే కరణ్‌ జోహార్‌. కమర్షియల్‌ సినిమాలను కాచి వడపోసి వడ్డించడంలో దిట్ట. అయినాసరే మెదడులో ఆ యాక్టింగ్‌ పురుగు అనేది ఒకటి ఉంది చూశారు.. అది మైండ్‌ బ్లోయింగ్‌ అంతే.

మొన్నామధ్యన వచ్చిన ''బాంబే వెల్వెట్‌'' సినిమాలో రణబీర్‌ కపూర్‌ కు ఆపోజిట్‌ లో విలన్‌ గా అలరించాడు కరణ్‌ జోహార్. ప్రసిద్ద దర్శకుడు అనురాగ్‌ కాశ్యప్‌ తీసిన ఆ డిజాష్టర్‌ తో తాను యాక్టింగ్‌ కెరియర్‌ ను ప్రారంభించడం కారణంగా.. అసలు తనకు ఎవ్వరూ ఆఫర్లే ఇవ్వట్లేదని అంటున్నాడు.. ''నా యాక్టింగ్‌ ఎంత చెత్తగా ఉందో చూసుకోండి. విలన్‌ గా చేసిన తొలి ఫిలిం ఫ్లాపు కాబట్టి.. కనీసం ఇప్పుడు నేనే స్వయంగా ప్రొడ్యూస్‌ చేసిన 'కపూర్‌ అండ్‌ సన్స్‌' సినిమా డైరక్టర్‌ కూడా నన్ను యాక్ట్‌ చేస్తారా బాస్‌ అని అడగనేలేదు'' అంటూ కపూర్‌ అండ్‌ సన్స్‌ ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా చెప్పుకొచ్చాడు కరణ్‌.

కరక్టేలే గురువు గారూ.. ఫ్లాప్‌ హీరోలతో మీరు సినిమాలు తీస్తారా చెప్పండి? అలాగే మీ విలనీ ఫ్లాపైంది కాబట్టి మీకు ఎవ్వరూ అవకాశాలే ఇవ్వట్లేదు.
Tags:    

Similar News