కనులు కనులను.. అక్కడ కూడా ఛాన్స్ లేదు!

Update: 2020-04-25 23:30 GMT
లాక్ డౌన్ ప్రకటనకు కొన్ని రోజుల ముందు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన 'కనులు కనులను దోచాయంటే' అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో 'పెళ్లి చూపులు' ఫేమ్ రీతు వర్మ హీరోయిన్ గా నటించింది. నిజానికి ఈ సినిమా రిలీజ్ అయిందని చాలా మందికి తెలియదు. రిలీజ్ కి ముందు ప్రెస్ షో వేస్తే చాలామంది క్రిటిక్స్ మంచి సినిమా అంటూ కితాబిచ్చారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన అతికొద్ది మంది ప్రేక్షకులు కూడా సినిమా బాగుంది అంటూ ప్రశంసించారు. అయితే ఎందుకో కానీ ఈ సినిమా పెద్దగా థియేటర్స్ లో ఆడలేదు. ప్రమోషన్ కూడా గొప్పగా జరగక పోవడంతో జనాలకు కూడా ఈ సినిమా గురించి పెద్దగా తెలియలేదు. అయితే ట్రేడ్ వర్గాల వారు మాత్రం ఇది నిజంగా మంచి సినిమా అని.. అన్నీ కలిసి వస్తే మంచి హిట్ అయి ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమా ఆహా యాప్ లో అందుబాటులోకి రానుంది. అయినా కానీ ఎక్కువ మందికి ఈ సినిమా చూసే అదృష్టం మాత్రం ఉండదు. కారణమేంటంటే ఆహా కు ఉన్న సబ్ స్కైబర్ల సంఖ్య తక్కువ. ఆడియన్స్ లో పెద్దగా రెస్పాన్స్ లేదు. బోల్డ్ కంటెంట్.. బ్యాడ్ గా ఉందని రివ్యూలు కూడా ఉన్నాయి.. టెక్నికల్ గ్లిచెస్ కూడా ఉన్నాయని వార్తలు వినిపించాయి. ఇలాంటి పలు కారణాల వల్ల ఈ యాప్ లో ఉన్న ఇతర సినిమాలకు ఆశించిన స్థాయిలో క్లిక్స్ రావడం లేదనే టాక్ ఉంది. దీంతో సినిమాకు థియేటర్లలో జరిగింది ఓ టీటీ విషయంలో కూడా పునరావృతం అవుతుందని భావిస్తున్నారు.

ఈ విషయంలో కొందరు నెటిజన్లు సినిమా నిర్మాతలపై ఫైర్ కూడా అవుతున్నారు. ఎక్కువ ఆదరణ కలిగిన.. ఎక్కువ సబ్ స్కైబర్లు ఉన్న ఓటీటీ చేతిలో కనుక ఈ సినిమాను పెట్టి ఉంటే భారీ ఆదరణకు నోచుకుని ఉండేదని.. థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచినా ఓటీటీ ప్రేక్షకుల మనసు గెలిచి ఉండేదని.. ఆ అవకాశాన్ని చేజేతులా పాడు చేసుకున్నారని విమర్శిస్తున్నారు. మంచి సినిమానే కానీ ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ అయ్యే అవకాశం లేకుండా పోవడం నిజంగానే బాధాకరమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News