వర్మ పురుగు స్క్రిప్ట్ కూడా పూర్తి అయ్యిందట
కరోనా వైరస్ పై పలువురు సంగీత దర్శకులు పాటలను రూపొందించిన విషయం తెల్సిందే. చాలా పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ పాట పురుగు కూడా నెట్టింట హల్ చల్ చేసింది. కరోనా వైరస్ కే కడుపులో తిప్పే విధంగా వర్మ ఆ పాటను పాడి కరోనాను ఇష్టం వచ్చినట్లుగా తిట్టేసి మరీ విభిన్నమైన పాటను రూపొందించాడు. వర్మ పాటతోనే సరిపెట్టకుండా సినిమాను కూడా తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
తాజాగా ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. కరోనా వైరస్ పై సినిమా చేస్తున్నట్లుగా ప్రకటించాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యిందని వర్మ ప్రకటించాడు. వర్మ సినిమా చేస్తానంటూ ప్రకటించడం మామూలే. కరోనాపై ఎంతో మంది సినిమా చేస్తామంటున్నారు. అలాగే వర్మ కూడా ఖచ్చితంగా కరోనా పై సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. కాని ఇంత త్వరగా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేస్తాడని ఎవరు ఊహించి ఉండరు.
లాక్ డౌన్‌ను ఎత్తి వేసిన వెంటనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా వర్మ ప్లాన్ చేస్తున్నాడట. వర్మ సినిమా మేకింగ్ విషయంలో చాలా స్పీడ్ గా ఉంటాడు. ఆయన ఏం చేసినా కూడా సంచలనమే. ఈ కరోనా సినిమా కాన్సెప్ట్ ఎలా ఉన్నా.. కథాంశం ఎలా ఉన్నా కూడా కమర్షియల్ గా మాత్రం మంచి బజ్ ను క్రియేట్ చేయడం ఖాయం. వర్మ తన సినిమాకు విపరీతంగా పబ్లిసిటీ చేసి ఖచ్చితంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలడు. చాలా కాలంగా సక్సెస్ లు లేకుండానే సినిమాలు చేస్తున్న వర్మకు ఈ పురుగు సినిమా అయినా కమర్షియల్ హిట్ ను ఇస్తుందేమో చూడాలి.