ఉత్త‌మ జాతీయవాది ఎలా ఉండాలో క్లాస్ తీస్కున్న కంగ‌న‌‌

Update: 2021-04-08 11:35 GMT
క్లాస్ తీస్కోవ‌డం అన్న‌ది గొప్ప క‌ళ‌. అది అంద‌రికీ ద‌క్క‌ని క‌ళ‌. ఇలాంటి అరుదైన క‌ళ‌ను త‌న సొంతం చేసుకున్న కంగ‌న ఇప్ప‌టికే చాలా విష‌యాల‌పై ర‌క‌ర‌కాల క్లాస్ లు తీస్కున్నారు. కొన్నిసార్లు అవి అభాసుపాలైతే.. చాలా సార్లు అభిమానుల్ని రంజింప‌జేశాయి. కంగ‌న ప్ర‌తి క్లాస్ అంత‌ర్జాలంలో చ‌ర్చ‌నీయాంశ‌మే. తాజాగా అల్ట్రా నేష‌న‌లిజంపై కంగ‌న తీస్కున్న క్లాస్ నెటిజ‌నుల్లో పెద్ద డిబేట్ కి తెర తీసింది.

``మీరు మీ దేశాన్ని ప్రేమిస్తే.. మీరు మీ దేశం పట్ల మక్కువతో ఉంటే మీరు ఒక జాతీయవాది. మీ ప్రతి చర్య దేశం శ్రేయస్సును నిర్దేశిస్తుంది. మీరు ఖర్చు చేసే ప్రతి పైసా మీరు మీ దేశం బాగు కోస‌మే చేయానుకుంటారు. ప్రజలు ప్రయోజనం పొందాలి. అప్పుడు మీరు ఒక అల్ట్రా నేష‌న‌లిస్ట్(ఉత్త‌మ జాతీయవాది). #వోక‌ల్ ఫ‌ర్ లోక‌ల్‌!``

ఒక స్థానిక నేత‌కు చెందిన‌ ఒక కేసు విష‌య‌మై కంగ‌న స్పందించి ఇలా క్లాస్ తీస్కున్నారు. ఒక జాతీయవాది అల్ట్రానేషనలిస్ట్ మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. దేశాన్ని ప్రేమించడం అనేది జాతీయవాదిగా మారుస్తుందని.. ఆ వ్య‌క్తి ప్రయత్నాలన్నీ దాని శ్రేయస్సు వైపు మళ్ళిస్తే వారు 'అల్ట్రానేషనలిస్ట్' గా మారుతారని కంగ‌న‌ అన్నారు.

గత మార్చిలో కంగ‌న పాశ్చాత్య దుస్తుల విధానంపైనా విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. విదేశీ చినుగుల జీన్స్ పై వ్య‌తిరేక కామెంట్ తో దుమారానికి కార‌ణ‌మ‌య్యారు. సాంప్రదాయ దుస్తుల‌ను వ‌దిలేసి చిట్టి పొట్టి అమెరికా డెనిమ్ లు తొడుక్కుని రోడ్ల‌పై తిరుగుతారా? అని కంగ‌న ప్ర‌శ్నించ‌గా సంచ‌ల‌న‌మే అయ్యింది. అంత‌కుముందు మ‌ణిపురి చేనేత‌కు కంగ‌న ప్ర‌చారం చేశారు. మన సొంతం అయిన దానిని ప్రోత్స‌హించ‌డ‌మే జాతీయ వాదం... అని అప్పుడూ క్లాస్ తీస్కున్నారు.

మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రంలో న‌టించాక కంగ‌న‌లో రెబ‌లిజం అంచెలంచెలుగా బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. ప్ర‌స్తుతం కంగన అమ్మ జ‌య‌ల‌లిత పాత్ర‌లో క‌నిపించ‌నుంది. త‌లైవి చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 30 న తమిళం- తెలుగు- హిందీ భాషలలో థియేటర్లలో విడుదల కానుంది. అలాగే ధాక‌డ్ అనే భారీ యాక్ష‌న్ చిత్రంలోనూ కంగ‌న న‌టిస్తోంది. ప‌లు ఇత‌ర ప్రాజెక్టులకు షెడ్యూల్స్ కేటాయిస్తోంది.
Tags:    

Similar News