మ‌ళ్లీ పూరి దర్శ‌క‌త్వంలో కంగ‌నా?

Update: 2016-11-13 23:15 GMT
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయ‌డం చాలా అరుదు. ఐతే కంగ‌నా ర‌నౌత్ హీరోయిన్ గా ఓ ఎదుగుతున్న టైంలో తెలుగులో ‘ఏక్ నిరంజన్’ సినిమా చేసింది. ఐతే ఆ సినిమా కేవ‌లం డ‌బ్బుల కోస‌మే ఒప్పుకున్నానంటూ ఈ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచింది. ప్ర‌స్తుతం ఆమె బాలీవుడ్లో ఉన్న స్థాయికి తెలుగులో మ‌ళ్లీ ఇంకో సినిమా చేస్తుంద‌ని ఎవ్వ‌రూ అనుకోవ‌ట్లేదు. ఇక్క‌డి వాళ్లు ఎవ‌రూ కూడా ఆమెను సంప్ర‌దిస్తున్న‌ట్లు లేదు. ఇలాంటి త‌రుణంలో పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో కంగ‌నా మ‌ళ్లీ తెలుగులో ఓ సినిమా చేస్తుంద‌న్న వార్త టాలీవుడ్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

కంగ‌నా తెలుగులోకి పున‌రాగ‌మ‌నం చేస్తుంద‌న్న వార్తే ఆశ్చ‌ర్య‌మంటే.. ఆమె ఇక్క‌డ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పూరి ఇంత‌కుముందు చేసిన లేడీ ఓరియెంటెడ్ ఫిలిం ‘జ్యోతిల‌క్ష్మీ’ ఫ‌లిత‌మేంటో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. మ‌రి ఈ పరిస్థితుల్లో కంగ‌నా క‌థానాయిక‌గా తెలుగులో పూరి సినిమా చేస్తాడా అన్న‌ది డౌటే. మ‌రి ఈ ప్ర‌చారం ఎలా మొద‌లైందో మ‌రి. టెంప‌ర్ త‌ర్వాత వ‌రుస‌గా మూడు ఫ్లాపులు ఎదుర్కొన్న పూరి.. ఇప్పుడు త‌నేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. ఇలాంటి స్థితిలో చాలా ప్ర‌త్యేక‌మైన సినిమాలే చేస్తూ వ‌స్తున్న కంగ‌న‌ను పూరి ఎలా మెప్పించాడో చూడాలి. పూరి-కంగ‌నా కాంబినేష‌న్ ఎంత వ‌ర‌కు నిజ‌మో కొన్ని రోజుల్లో తేలిపోవచ్చు.
Tags:    

Similar News