ప్రఫుల్ పటేల్ గా బాలీవుడ్ క్వీన్

Update: 2016-10-21 04:54 GMT
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అటు కమర్షియల్ సినిమాలను ఇటు కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలను మరోవైపు సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టే చిత్రాలను కూడా చేసేయగలదు. క్వీన్.. తను వెడ్స్ మను చిత్రాలతో అమ్మడి ట్యాలెంట్ ఏంటో అభిమానులకే కాదు.. ఇండస్ట్రీ జనాలకు కూడా బాగానే అర్ధమయింది. అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటూ ఆశ్చర్యపరుస్తున్న కంగనా.. ప్రస్తుతం సిమ్రన్ అనే మూవీలో నటిస్తోంది.

హన్సల్ మెహతా డైరెక్షన్ లో సిమ్రన్ తెరకెక్కుతుండగా.. ఇందులో కంగనా రనౌత్ పాత్రపై ఆసక్తికరమైన డీటైల్స్ బయటకొచ్చాయి. ప్రఫుల్ పటేల్ అనే పాత్రలో ఈ అమ్మడు కనిపించనుందట. 30 ఏళ్ల వయసులోనే విడాకులు తీసుకున్న యువతి.. ఆ తర్వాత ఆమె ఎదుర్కున్న పరిస్థితుల చుట్టూ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో పెరిగిపోతున్న డైవోర్స్ కల్చర్.. ఈ కారణంగా తలెత్తుతున్న మార్పులను కొత్త కోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తోందట టీం.

అందాల భామగానో.. 20 ఇయర్స్ బ్యూటీగానో కాకుండా.. థర్టీ ప్లస్ కేరక్టర్ అయిన ప్రఫుల్ పటేల్ పాత్రను ఎంచుకోవడంలోనే కంగనా ఎంత డేరింగ్ అనే విషయం అర్ధమవుతోంది. సిమ్రన్ లో తన బాడీతో పాటు.. బాడీ లాంగ్వేజ్ ని.. భాషను కూడా కొత్తగా చూపించేందుకు ట్రై చేస్తోందట కంగనా.
Tags:    

Similar News