ప్రియుడితో శ్రుతి బ్రేక‌ప్‌ అస‌లు కార‌ణం?

బాయ్‌ఫ్రెండ్ శంతను హజారికా నుంచి విడిపోవడంతో శృతి హాస‌న్ ఇటీవ‌ల‌ వార్తల్లో నిలిచింది.

Update: 2024-05-01 05:31 GMT

బాయ్‌ఫ్రెండ్ శంతను హజారికా నుంచి విడిపోవడంతో శృతి హాస‌న్ ఇటీవ‌ల‌ వార్తల్లో నిలిచింది. ఈ జంట నాలుగేళ్ల డేటింగుకి ముగింపు ప‌ల‌క‌డం అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు సోష‌ల్ మీడియాల్లో అన్ ఫాలో చేసుకోవ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆ త‌ర్వాత శంత‌ను హ‌జారిక స్వ‌యంగా బ్రేక‌ప్ ని అధికారికంగా నిర్ధారించారు.

ఇప్పుడు ఒక ప్ర‌ముఖ‌ న్యూస్ పోర్టల్ క‌థ‌నం ప్రకారం.. ఒకప్పుడు చాలా ప్రేమలో ఉన్న ఈ జంట నిబద్ధత లేమి కారణంగా ఒక‌రి నుంచి ఒక‌రు విడిపోయార‌ని తెలుస్తోంది. శ్రుతి పెళ్లి చేసుకోవాల‌ని ప్ర‌పోజ‌ల్ పెట్టింది.. కానీ శంత‌ను దానికి ఆస‌క్తిగా లేడు. ఈ కారణంగానే వారు విడిపోయార‌ని క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే ఈ బ్రేక‌ప్ వార్త‌లు బ‌య‌టికి వ‌చ్చాక శ్రుతిహాస‌న్ స్టాట‌స్ ఏమిటా? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి.

కానీ శ్రుతిహాస‌న్ ఈసారి డిప్రెష‌న్ మోడ్‌లో లేదు. దీనిని లైట్ తీస్కున్న‌ట్టే క‌నిపిస్తోంది. త‌న ఇన్ స్టా మాధ్య‌మంలో వ‌రుస‌గా ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ క‌నిపిస్తోంది. త‌న సోద‌రి అక్ష‌ర హాస‌న్ తో శ్రుతి క‌లిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసింది. దీనిని బ‌ట్టి శ్రుతి ఇప్పుడు త‌న కుటుంబంతో గడిపేందుకు ఛాయిస్ తీసుకుంది. ప్ర‌స్తుతం శ్రుతిహాస‌న్ పూర్తిగా త‌న కెరీర్ పై ఫోక‌స్ చేసేందుకు ఆస‌క్తిగా ఉంద‌ని తెలుస్తోంది. విదేశీయుడైన మైఖేల్ కోర్స‌లేతో మొదటిసారి ప్రేమ‌లో ప‌డిన శ్రుతిహాస‌న్ అత‌డితో నాలుగేళ్ల స‌హ‌జీవ‌నం త‌ర్వాత బ్రేక‌ప్ అయింది. ఆ త‌ర్వాత శంత‌నుతో మ‌రో నాలుగేళ్ల ప్రేమాయ‌ణం, ఇప్పుడు బ్రేక‌ప్ ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ గా మారాయి.

శ్రుతి వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. ఇటీవ‌లే లోకేష్ క‌న‌గ‌రాజ్ కి పెయిర్ గా `ఇనిమే` అనే రొమాంటిక్ సాంగ్ (సింగిల్ ఆల్బ‌మ్)లో క‌నిపించింది. ఈ పాట ఇన్ స్టంట్ హిట్ కొట్టింది. త‌దుప‌రి త‌లైవా 171లోను శ్రుతి కీల‌క పాత్ర‌ను పోషించే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. స‌లార్ 2లో న‌టించాల్సి ఉంది. అలాగే చెన్నై స్టోరి అనే చిత్రంలోను శ్రుతిహాస‌న్ న‌టిస్తోంది.

Tags:    

Similar News