శ్రీనువైట్ల విశ్వం.. అన్ని ఫ్లాప్స్ ఉన్నా బడ్జెట్ గట్టిగానే..

టీజర్ బట్టి గోపీచంద్ ఈ సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

Update: 2024-05-01 05:30 GMT

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం అనే ఒక డిఫరెంట్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్, క్యారెక్టర్ టీజర్ రిలీజ్ చేశారు. కాస్త ఫారిన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్నారు. టీజర్ బట్టి గోపీచంద్ ఈ సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

శ్రీనువైట్ల చివరిగా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో 2018లో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ తర్వాత శ్రీను వైట్ల చాలా గ్యాప్ తీసుకున్నారు. అయితే ఈ గ్యాప్ ఆయన తీసుకున్నారు అనేకంటే వచ్చిందని చెప్పొచ్చు. బాద్ షా తర్వాత శ్రీను వైట్ల వరుసగా నాలుగు బిగ్గెస్ట్ డిజాస్టర్ లని ఖాతాలో వేసుకున్నాడు. మహేష్ బాబు ఆగడు, రామ్ చరణ్ బ్రూస్ లీ, వరుణ్ తేజ్ మిస్టర్ డిజాస్టర్ అయ్యాయి.

ఈ సినిమాల ఇంపాక్ట్ ఆయన ఇమేజ్ మీద కూడా పండింది. వరుస ఫ్లాప్ ల కారణంగా పెద్ద హీరోలు ఎవరూ కూడా శ్రీనువైట్లతో సినిమాలు చేయడానికి ముందుకి రాలేదు. మధ్యలో మంచు విష్ణుతో ఢీ సీక్వెల్ ఎనౌన్స్ చేసిన ఎందుకనో కార్యరూపం దాల్చలేదు. ఫైనల్ గా మ్యాచో స్టార్ గోపీచంద్ ని మెప్పించి విశ్వం సినిమా స్టార్ట్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

Read more!

గోపీచంద్ కూడా గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్నారు. అయిన కూడా నిర్మాతలు భారీ బడ్జెట్ లతోనే అతనితో మూవీస్ చేయడానికి ముందుకొస్తున్నారు. విశ్వం సినిమాని మినిమమ్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు అనే టాక్ వచ్చింది. అయితే కంటెంట్ డిమాండ్ చేయడంతో బడ్జెట్ పరిధి పెంచినట్లు సమాచారం. మూవీకి 32 నుంచి 35 కోట్ల మధ్య పెట్టుబడి పెడుతున్నారంట. మొదట ఈ సినిమాను వేరే నిర్మాతలతో 20 కోట్ల బడ్జెట్ లోపే నిర్మించాలని అనుకున్నారు. కానీ బడ్జెట్ లెక్కలు దాటుతున్నట్లు తెలియడంతో పీపుల్స్ మీడియం రంగంలోకి దిగాల్సి వచ్చింది.

కంటెంట్ బాగుంటే గోపీచంద్ సినిమాలకి నాన్ థీయాట్రికల్ బిజినెస్ బాగా జరుగుతోంది. ఈ కారణంగానే నిర్మాత విశ్వప్రసాద్ డేర్ చేసి భారీ బడ్జెట్ పెడుతున్నారంట. ఈ సినిమాతో శ్రీనువైట్ల బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ శ్రీను వైట్ల గత సినిమాల మాదిరిగా కాకుండా కంప్లీట్ గా న్యూ టెంప్లేట్ లో ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News