కొత్త కోడలు వచ్చేసిందోచ్.. 'ఇడుపు కాయితం' రిలీజ్ ఎప్పుడంటే?
పెళ్లి తర్వాత కొత్త కోడలు ఇంట్లోకి అడుగుపెట్టడం.. ఆ సమయంలో కుటుంబంలో ఉండే సందడి, సరదాలు.. ఇవన్నీ ప్రతి ఇంట్లో కనిపించే సీన్లే.
పెళ్లి తర్వాత కొత్త కోడలు ఇంట్లోకి అడుగుపెట్టడం.. ఆ సమయంలో కుటుంబంలో ఉండే సందడి, సరదాలు.. ఇవన్నీ ప్రతి ఇంట్లో కనిపించే సీన్లే. అలాంటి విలేజ్ ఎన్విరాన్మెంట్ ను గుర్తు చేస్తూ 'గడప' పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'ఇడుపు కాయితం' సినిమా. అదే సమయంలో ఆ మూవీ విడుదల తేదీ కూడా ఫిక్స్ అయింది. ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆ ఫ్యామిలీ డ్రామాను డిసెంబర్ 11న థియేటర్లలోకి తీసుకురానున్నారు.
తెలంగాణ పల్లెటూరి కుటుంబం చుట్టూ సాగే కథతో ఆ సినిమా రూపొందుతోంది. ప్రియదర్శి హీరోగా నటిస్తుండగా.. తెలంగాణ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఆ మూవీతో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్ పై బన్నీ వాస్ 'ఇడుపు కాయితం' చిత్రాన్ని గ్రాండ్ నిర్మిస్తున్నారు.
అయితే ఆ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకుల్లో హైప్ మొదలైంది. 'ఇడుపు కాయితం' అంటే విడాకుల పత్రం. సాధారణంగా పెళ్లి, కుటుంబం, బంధాల గురించి వచ్చే సినిమాల్లో ఇలాంటి టైటిల్ కనిపించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. పెళ్లితో మొదలయ్యే జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, కుటుంబ సభ్యుల మధ్య ఉండే రిలేషన్స్ స్టోరీలో ఎలా ఉంటాయన్నది ఆసక్తి పెంచుతోంది. అయితే సినిమా కథలో ఎలాంటి ట్విస్టులు ఉంటాయన్నది స్క్రీన్ పైనే తెలియాలి.
ఇప్పటికే ఆ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా రిలీజ్ చేసిన 'గడప' సాంగ్ పెళ్లి తర్వాత కొత్త కోడలు ఇంట్లోకి వచ్చే మూమెంట్ ను చూపిస్తోంది. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే సమయంలో ఉండే ఆనందం, కుటుంబ సభ్యుల మధ్య కనిపించే రిలేషన్స్ ను ఆ సాంగ్ లో చూపించారు. పల్లెటూరి పెళ్లి వాతావరణాన్ని గుర్తు చేసేలా సాంగ్ సాగుతోంది. సురేశ్ బొబ్బిలి ఆ పాటకు సంగీతం అందించగా.. అభినయ శ్రీనివాస్ సాహిత్యం అందించారు. తేలు విజయ పాడారు.
అంతకుముందు విడుదలైన 'శ్రీలత.. ఈ శ్రీనివాసుడే నీ జత..' పాట కూడా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంది. ఇలా సాంగ్స్ తో సినిమాపై హైప్ పెంచుతున్న మూవీ టీమ్ ఇప్పుడు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఇక సినిమాలో శివజ్యోతి, జోర్దార్ సుజాత, చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చ రవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తెలంగాణ యాస, పల్లెటూరి వాతావరణం, కుటుంబ సంబంధాలతో రూపొందుతున్న ఆ సినిమా ప్రేక్షకులకు దగ్గరవుతుందని మూవీ టీమ్ భావిస్తోంది. అయితే ఫ్యామిలీ స్టోరీలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి రెస్పాన్స్ ఉంటుంది. అందులోనూ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పెళ్లి, బంధాలు, కుటుంబంలో ఎదురయ్యే పరిస్థితులను చూపించే స్టోరీలు కచ్చితంగా ఆసక్తి కలిగిస్తాయి. మరి డిసెంబర్ 11న విడుదల కానున్న 'ఇడుపు కాయితం' మూవీ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.