త‌ళా అజిత్‌కి షాలిని గిఫ్ట్ బాప్‌రే!

ఈ రోజు అజిత్ 53వ పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా ప్రియమైన భార్య, మాజీ నటి షాలిని అజిత్ కుమార్ అతడిని అద్భుతమైన డుకాటీ కార్ కానుక‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు.

Update: 2024-05-01 05:00 GMT

కోలీవుడ్ లో ఆద‌ర్శ జంట‌గా మంచి పేరు తెచ్చుకున్నారు షాలిని- అజిత్. ఈ జోడీ ప్రేమైక జీవ‌నం అభిమానుల‌కు ఎంతో స్ఫూర్తిదాయకం. తాజా స‌మాచారం మేర‌కు.. అజిత్ పుట్టినరోజు సందర్భంగా అతనికి అద్భుతమైన డుకాటీని బహుమతిగా ఇచ్చారు షాలిని. ప్ర‌స్తుతం ఈ కానుక‌కు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

 

త‌ళా అజిత్ కుమార్- షాలిని దంప‌తుల ప్రేమ‌క‌థ గురించి తెలిసిందే. ఈ జంట క‌లిసి న‌టించే క్ర‌మంలో ఒక‌రితో ఒక‌రు ప్రేమ‌లో ప‌డ్డారు. అటుపై పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లాడారు. అజిత్ న‌టించిన చివరి చిత్రం 'తునివు' బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఓపెనింగులు సాధించింది. ప్రస్తుతం మగిజ్ తిరుమేని లాంటి ప్ర‌తిభావంతుడి దర్శకత్వంలో 'విదా ముయార్చి' చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు.

ఈ రోజు అజిత్ 53వ పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా ప్రియమైన భార్య, మాజీ నటి షాలిని అజిత్ కుమార్ అతడిని అద్భుతమైన డుకాటీ కార్ కానుక‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దీనిపై బోలెడంత చ‌ర్చ సాగుతోంది.

'విదా ముయార్చి'తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ లో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే సినిమాలోను అజిత్ న‌టిస్తున్నాడు. ప్రఖ్యాత దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నారు. త‌ళా అజిత్ కోలీవుడ్ అగ్ర హీరోగా స‌త్తా చాటుతున్నాడు. వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నాడు.

Tags:    

Similar News