మరోసారి మీడియాపై పడ్డ లేడీ ఫైర్‌ బ్రాండ్‌

Update: 2021-01-30 04:04 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ మరోసారి సోషల్ మీడియా ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్‌ లేదా ఇతర విషయాలపై మాట్లాడే కంగనా ఈ సారి మీడియా సంస్థలపై తన కోపంను వెళ్లడి చేసింది. ఒక ప్రముఖ వెబ్‌ పోర్ట్‌ కు సంబంధించిన ఆర్టికల్‌ ను షేర్‌ చేసిన ఆమె ఇలాంటి వార్తల వల్ల ప్రముఖుల పరువు పోవడంతో పాటు అవతలి వారి క్యారెక్టర్‌ ను తక్కువ చేసి చూపించడం జరుగుతుందని ఇలాంటి వార్తలను బ్యాన్‌ చేయాలంటూ కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్‌ జవ్‌ దేకర్‌ ను కోరింది. పేర్లు ప్రస్థావించకుండా రాసే కథనాలే అయినా కూడా ఇండస్ట్రీ వర్గాల్లో కొందరి పరువు తీయడంతో పాటు ఇండస్ట్రీ పరువు తీసే విధంగా కూడా ఉన్నాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

సోర్స్‌ లేకుండా ఊహజనితమైన ఆర్టికల్స్ ను రాసే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు కొన్ని మీడియా సంస్థలకు ఆగ్రహంను తెప్పిస్తున్నాయి. పేర్లు ప్రస్థావించకుండా రాసినప్పుడు మీకు వచ్చే సమస్య ఏంటీ అంటూ ఆమెను నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఏదో ఒక విధంగా వేలు పెట్టి తన ఉనికిని చాటుకునేందుకు ఈ అమ్మడు ప్రయత్నిస్తుంది అంటూ కంగనాపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇక కంగనా నటించిన తలైవి సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఇటీవలే ఈమె ఇందిరా గాంధీ పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఒక ఫొటో ద్వారా తెలియజేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెళ్లడి అవ్వాల్సి ఉంది.
Tags:    

Similar News