అవార్డ్ తీసుకుని అగ్గి రాజేశాడు

Update: 2016-03-30 06:06 GMT
ఈ ఏడాది జాతీయ ఉత్తమ దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీ ఎంపికయ్యాడు. బాజీరావ్ మస్తాని చిత్రానికి ఈ అవార్డ్ దక్కింది. తనకు ఈ పురస్కారం దక్కడం సంతోషం ప్రకటించిన భన్సాలీ... ఇద్దరు హీరోయిన్ల మధ్య మంట రగిలించాడు. మామూలుగానే బాలీవుడ్‌ భామలు కంగనా రనౌత్‌, దీపిక పదుకొణెల సయోధ్య అంతంత మాత్రం. పైగా కోల్డ్‌ వార్‌ కూడా కంటిన్యూ అవుతోంది. ఇలాంటి సమయంలో దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ వీరిద్దరి మధ్య అగ్గి రాజేసే వివాదాస్పద కామెంట్ చేశాడు.

'జాతీయ ఉత్తమ నటి పురస్కారం కంగనా రనౌత్ కు దక్కడం సంతోషమే. అయితే ఈ అవార్డు దీపికా పదుకొణేకి కాని, ప్రియాంక చోప్రాకి కానీ వచ్చి ఉండాల్సింది' అన్నాడు భన్సాలీ. ఇలా ఒకరికి ఓ అవార్డ్ అనౌన్స్ చేశాక.. వేరేవారికి ఇవ్వాల్సింది అనే వ్యాఖ్య చేయడమంటే.. అసంతృప్తిని వ్యక్తపరచడమే. భన్సాలీ చేసిన ఈ కామెంట్స్ దీపికాకి ఆనందాన్ని ఇచ్చేవే అయినా... కంగనకు మాత్రం కోపం తెప్పించేవే. సాధారణంగా ఫైర్ బ్రాండ్ రేంజ్ లో రియాక్షన్స్ ఇచ్చే కంగన రనౌత్ దీనిపై ఇంకా స్పందించలేదు.

అయితే  భవిష్యత్తులో కంగనాతో కలిసి పనిచేసే అవకాశం ఉందా అని అడిగితే.. ‘ ఇప్పుడే చెప్పలేన.. అదంతా ప్లానింగ్‌ పై ఆధారపడి ఉంది.’ అన్నాడు భన్సాలీ.
Tags:    

Similar News