• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఒంట‌రి దీవిలో జంట‌ల...

ఒంట‌రి దీవిలో జంట‌ల స‌య్యాట‌లు.. హోస్ట్ ఎవ‌రంటే?

By - Tupaki Desk
Update: 2021-07-16 04:26 GMT
అది ఒక ఒంట‌రి దీవి. ఈ దీవిలోకి కొన్ని జంట‌ల‌కే ఆహ్వానం. వీళ్ల‌తో పాటు కొంద‌రు సింగిల్స్ (ఆడా మ‌గా)ని కూడా అనుమ‌తిస్తారు. ఆ దీవి మొత్తం సీసీ కెమెరాల‌తో బంధించ‌బ‌డి ఉంటుంది. అంటే ఇక్క‌డ ఏం జ‌రిగినా ప్ర‌తిదీ లైవ్ గానే.. కొన్నిచోట్ల ప్రైవ‌సీ ఉంటుంద‌నుకోండి. ఇక ఆ దీవిలో ర‌చ్చ ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. జంట‌ల రొమాన్స్.. సింగిల్స్ ప్రేమాయ‌ణాలు .. బ్రేక‌ప్ లు గొడ‌వ‌లు వ‌గైరా వ‌గైరా పాట్లు .. అబ్బో ఆ సీన్లు వింటేనే రంజుగా ఉన్నాయి. అలాంటి రంజైన షోకి ఇన్నాళ్లు ఇండియన్ భాష‌ల్లో లోక‌ల్ గా రూపొందితే వీక్షించే అవ‌కాశం లేదు. ఇక్క‌డ ఎవ‌రూ ఇలాంటి ప్ర‌యోగం చేయ‌లేదు. అమెరికాలో ఈ త‌ర‌హా షో గొప్ప పాపులారిటీ ద‌క్కించుకుంది. టెంప్టేష‌న్ అనేది ఈ రియాలిటీ షో టైటిల్. ఇప్పుడు అదే టెంప్టేష‌న్ స్ఫూర్తితోనే ఇండియాలోనూ ఇలాంటి ఒక షోని ప్లాన్ చేశారు. ఇది ప్ర‌ముఖ‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి హోస్ట్ ఎవ‌రో తెలుసా?   ది గ్రేట్ కాంట్ర‌వ‌ర్శీ క్వీన్ కంగ‌న ర‌నౌత్.

ఒంట‌రి దీవిలో జంట‌ల స‌య్యాట‌ల‌కు కంగ‌న హోస్టింగేమిటి? అంటారా? అక్క‌డే ఉంటుంది మ‌స్త్ మ‌జాక్! కంగ‌న ఇటీవ‌ల వ‌రుస ప్ర‌యోగాల‌తో చెల‌రేగుతున్న సంగ‌తి తెలిసిందే.  తాజాగా రియాలిటీ షోను నిర్వహించ‌డం ద్వారా త‌న పాపులారిటీ అంత‌ర్జాతీయంగా విస్త‌రించ‌నుంది. OTT ప్లాట్ ఫాంపై ఉత్కంఠభరితమైన రియాలిటీ షోతో జంటలు .. సింగిల్స్ ను కలిపి వారి బంధాన్ని పరీక్షించడానికి సంబంధాలను బలోపేతం చేయడానికి కంగ‌న సిద్ధమవుతోంది.

కంగనా రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరించనుంద‌ని తెలియ‌గానే అభిమానుల్లో ఒక‌టే క‌ల‌క‌లం చెల‌రేగింది. OTT షోని త‌న‌దైన వివాదాల‌తో హీటెక్కిస్తుందా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది.  ఈ ప్రదర్శన అమెరికన్ రియాలిటీ షో టెంప్టేషన్ ఐలాండ్ కి భారతీయ అనుసరణ. ఇప్ప‌టికే కంగ‌న హోస్టింగ్ కోసం సంతకం చేసింది. షూటింగును త్వ‌ర‌లో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నార‌ని తెలిసింది.

కంగనా రనౌత్ త‌న త‌దుప‌రి చిత్రం `ధాకాడ్` కోసం బుడాపెస్ట్ లో షూటింగ్ చేస్తున్నారు. రజ్నీష్ ఘాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో `ఏజెంట్ అగ్ని` పాత్రను కంగ‌న పోషిస్తోంది. క‌థానాయిక రాజ‌కీయ నాయ‌కురాలు జయలలిత జీవితం ఆధారంగా కంగన న‌టిస్తున్న `త‌లైవి` విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్ 23 న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ మహమ్మారి కారణంగా అది వాయిదా పడింది. ఈ ఏడాది ఆగస్టులో సినిమాను సినిమా హాళ్ళలో మాత్రమే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.

ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించిన `తలైవి` భారతదేశం అంతటా పలు భాషల్లో విడుదల కానుంది. ఇదే కాకుండా కంగన `తేజస్` చిత్రంలో వైమానిక దళ అధికారి పాత్రను పోషిస్తున్నారు. `ఎమర్జెన్సీ` అనే చిత్రానికి కంగ‌న ద‌ర్శ‌క‌త్వం వహించ‌నుంది. ఇందులో దివంగత ఇందిరా గాంధీ పాత్రను కంగ‌న పోషించ‌నుంది. `మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిద్దా` చిత్రీక‌ర‌ణ‌కు తన ప్రణాళికల‌ను కంగ‌న ఇటీవ‌ల‌ ప్రకటించారు.

కంగ‌న మ‌రోవైపు నిర్మాత‌గానూ బిజీ. కంగనా రనౌత్  ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోయే సినిమాలో ట్యాలెంటెడ్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీల‌క పాత్రలో న‌టిస్తార‌ని ఇటీవల ప్రకటించారు. అనుభవజ్ఞుడైన నటుడిని స్వాగతిస్తూ మణికర్ణికా ఫిల్మ్స్ సోషల్ మీడియాలో వివ‌రాల్ని పోస్ట్ చేసింది. నేటితరం ఉత్తమ నటుడు `టికు వెడ్స్ షెరు` జట్టులో చేరాడు… .మా లయన్ # టికువేడ్స్ షెరు చిత్రీకరణ త్వరలో ప్రారంభమవుతుంది`` అని తెలిపారు. బ్యాక్ టు బ్యాక్ న‌ట‌న ద‌ర్శ‌క‌త్వం నిర్మాణం వ‌గైరా షెడ్యూళ్ల‌తో బిజీబిజీగా ఉన్నారు.
Tags:    
  • Kangana Ranaut 
  • Kangana Ranaut ott 
  • kangana movies 
  • kangana ranaut In island 
  • kangana ranaut Ott Reality Show 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS