​థాక్రే పనికిమాలిన సీఎం? అనురాగ్​ కశ్యప్​ ఏమన్నా తోపా? కంగనా వ్యాఖ్యలు

Update: 2020-09-30 13:30 GMT
ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి వ్యాఖ్యలు చేసి సంచలనాలు సృష్టించే బాలీవుడ్​ వివాదాస్పద నటి కంగనా రనౌత్​ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ సారి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్​ థాక్రేతో పాటు ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్​ కశ్యప్​ ఇద్దరినీ మడతపెట్టి వాయించింది. వారిపై కంగనా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సుశాంత్​ సింగ్​ అనుమానాస్పద స్థితిలో చనిపోయాక కంగనా విమర్శలు ఎక్కుపెడుతోంది. ఆమె చేసిన ఆరోపణలతో బాలీవుడ్ తో పాటు మహారాష్ట్ర అట్టుడుకి పోతోంది. మరో వైపు బాలీవుడ్​లో డ్రగ్స్​కేసు కలకలం రేపుతోంది. ఇప్పటికే బాలీవుడ్​కు చెందిన నటి, సుశాంత్ మాజీ లవర్ రియా డ్రగ్స్​ కేసులో అరెస్టయ్యారు. మరో వైపు రకుల్​ ప్రీత్​సింగ్​, దీపికా పదుకొనే, సారా అలీఖాన్​, శ్రద్ధా కపూర్​కు ఈ కేసులో నోటీసులు అందాయి.  

సుశాంత్ విషయమై చెలరేగిన వివాదంలో ఇది వరకే సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే తో వివాదానికి దిగిన కంగనా బుధవారం  మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ ఈ దేశంలోనే అసమర్థ సీఎం ఎవరన్నా ఉన్నారంటే అది ఉద్దవ్​ థాక్రేనే.. ఆయనను ఎవరూ ప్రశ్నించొద్దా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? దర్శకుడు అనురాగ్​ కశ్యప్​ ఎంత నీచుడో ఏకంగా నటి పాయల్ ఘోష్​ చెప్పింది. అయినా అనురాగ్​ కశ్యప్​ సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నాడు. తప్పు ఒప్పుకొని క్షమాపణలు కోరకుండా బరితెగించి మాట్లాడుతున్నాడు. హరియాణాకు చెందిన యూట్యూబర్ సాహిల్ చౌదరి మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్​ చేసింది. ఇదెక్కడి న్యాయం. ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడటం కూడా తప్పేనా?’ అంటూ కంగనా ట్వీట్​ చేసింది. ఈ ట్వీట్​ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది.
Tags:    

Similar News