ఫోటో స్టొరీ: బోల్డ్ అవతారంలో క్వీన్!

Update: 2018-10-16 14:30 GMT
కంగనా రనౌత్ పేరు వినగానే ఇప్పుడెవ్వరూ 'ఫ్యాషన్' సినిమాలో 'మర్ జావా.. తేరే ఇష్క్ పే మర్ జావా' సాంగ్ స్టార్ట్ కాగానే ర్యాంప్ ను సూపర్ మోడల్ లా రఫ్ఫాడించిన హాట్ బ్యూటీ ని గుర్తు చేసుకోవడం లేదు.  ఝాన్సీ రాణిగా స్క్రీన్ పై శత్రువులపై  కత్తి దూస్తూ.. ఆఫ్ ది స్క్రీన్ లో కరణ్ జోహార్ లాంటి వాళ్ళను ఏకిపారేస్తూ ఉన్న ఫైర్ బ్రాండ్ లేడీనే గుర్తొస్తోంది.

మరి కంగనా కూడా తన లైఫ్ మరీ సీరియస్ గా ఉందని భావించిందేమో గానీ రీసెంట్ గా 'మణికర్ణిక' ర్యాప్ అప్ పార్టీ కి అల్ట్రా స్టైలిష్ దివా టైపులో హాజరయింది.  కంగనా గౌన్ ను డిజైన్ చేసింది ప్రఖ్యాత డిజైనర్లు గౌరీ - నైనిక లు. గ్రే కలర్ గౌన్ కు తళుకుబెళుకులు.. ఎంబ్రాయిడరీ చేసిన పూలతో ఫుల్ హాట్ గా ఉంది.  ఇక యాక్సెసరీస్ అసలేమీ ధరించకుండా జస్ట్ మేకప్ తోనే హాలీవుడ్ హీరోయిన్స్ కనిపించే స్టైల్ లో కనిపించింది.  డార్క్ లిప్ స్టిక్.. లూజ్ హెయిర్ తో కాస్త డిఫరెంట్ గా ఉన్నా మరోసారి తన హాట్నెస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది.

ఈ ఫొటోకు ఇన్స్టాగ్రామ్ లో రెస్పాన్స్ బాగానే ఉంది కానీ కంగనా లుక్ కు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఈ లుక్ సెట్ కాలేదని మేకప్ తేడా కొట్టిందని కొంతమంది విమర్శించారు. మీరు ఒక లుక్కేసి హాటుగా ఉందో లేదా తేడా కొట్టిందో డిసైడ్ చెయ్యండి.
Tags:    

Similar News