సుశాంత్‌ ఆత్మహత్యకు ఆ ఆరు నిర్మాణ సంస్థలు కారణం

Update: 2020-06-17 09:30 GMT
సుశాంత్‌ మృతి పై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వారిని ఎదగకుండా చేసే వారు చాలా మందే ఉన్నారు. వారికి ఆఫర్లు ఇవ్వకుండా వారు నటించిన సినిమాలు ఆడకుండా చేసేందుకు చాలా మంది చూస్తారని.. అలా వారిని మానసికం గా బాధ పెట్టి  డిప్రెషన్‌ లోకి వెళ్లి పోయేలా కొందరు బాలీవుడ్‌ స్టార్స్‌ చేస్తున్నారంటూ నెటిజన్స్‌ కరణ్‌ జోహార్‌ తో పాటు మరికొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ పై ట్రోల్స్‌ చేస్తున్నారు.

ఈ విషయమై వివాదాస్పద బాలీవుడ్‌ విమర్శకుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌ స్పందిస్తూ... సుశాంత్‌ ఆత్మహత్యకు పరోక్షంగా బాలీవుడ్‌ లో ప్రస్తుతం లీడ్‌ లో ఉన్న ఆరు నిర్మాణ సంస్థలు అన్నాడు. వారి వల్లే సుశాంత్‌ వంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేని వారు కెరీర్‌ లో కష్టాలను ఎదుర్కొంటున్నారు. వారు ఇతరులను ఎదగనివ్వడం లేదని విమర్శించాడు.

బాలీవుడ్‌ స్టార్స్‌ కు సుశాంత్‌ విషయం లో స్పందించే అర్హత లేదంటూ కొందరు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. బతికి ఉన్న సమయంలో అతడిని తొక్కేసేందుకు ప్రయత్నించిన చాలా మంది ఇప్పుడు ఆయన చని పోయిన తర్వాత మంచి నటుడిని కోల్పోయాం అని, మరి కొందరు తమను సాయం అడిగితే చేసే వాళ్లం అంటూ వ్యాఖ్యలు చేయడం దారుణం గా ఉందని నెటిజన్స్‌ విమర్శలు గుప్పిస్తున్నారు.
Tags:    

Similar News