• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కంగానాకే నిర్మాత...

కంగానాకే నిర్మాత సపోర్ట్.. క్రిష్ పై విమర్శలు

By - Tupaki Desk
Update: 2019-02-01 10:35 GMT
'మణికర్ణిక' సినిమా ఎలా ఉంది అనే విషయంపై ఎక్కడ కూడా  చర్చలు జరగడం లేదు. అన్ని చోట్లా క్రిష్ ఏమన్నాడు.. కంగనా ఏమంటోంది.. కంగనా సిస్టర్ రంగోలి ఏమని చెప్తోంది.. ఇవే ఇప్పుడు హాటు టాపిక్కులు.  'క్రెడిట్ ఎవరిది?' అనేదే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న.  ఈ విషయంలో క్రిష్ ను సమర్థించేవారు ఉన్నట్టే కంగనాను సమర్థించేవారు కూడా ఉన్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ పై 'మణికర్ణిక' నిర్మాత కమల్ జైన్ స్పందించారు.

అయన కంగనాకు మద్దతుగా నిలిచి క్రిష్ ప్రవర్తనను తప్పుపట్టారు. తనదికాని క్రెడిట్ కోసం పాకులాడుతున్నాడని క్రిష్ పై ఆయన విమర్శలు సంధించారు.  ఇద్దరికీ క్రెడిట్ ఇవ్వాలనేది అందరూ కలిసి చర్చించి తీసుకున్న ఉమ్మడి నిర్ణయమని తెలిపారు.  కంగనా సినిమా మొదటి నుండి చివరివరకూ అండగా నిలబడిందని..  ప్రొడక్షన్ టీమ్.. క్రియేటివ్ టీమ్ సహహారం లేకుండా ఆమె ఈ బాధ్యత నిర్వర్తించగలిగేది కాదని అన్నారు.  సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో క్రిష్ మీడియాలో ఈ విషయం నానేలా చేస్తున్నారని విమర్శించారు.  క్రిష్ చెప్పేవన్నీ నిజాలయితే కోర్టుకు వెళ్లి తన వాదన సరైనదని ఎందుకు ప్రూవ్ చేసుకోవడం లేదని ప్రశ్నించారు.

'మణికర్ణిక' నిర్మాత ఇలా విమర్శించడం క్రిష్ కు మింగుడుపడని విషయమే.  మరి ఈ విమర్శలకు క్రిష్ ఎలాంటి సమాధానం చెప్తాడో వేచి చూడాలి. ఇదిలా ఉంటే..సోషల్ మీడియాలో ఈ వివాదాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ వెర్షన్ ప్రచారంలో ఉంది.  'మణికర్ణిక' టీమ్ అంతా కావాలని సినిమాకు హైప్ తెచ్చేందుకు క్రిష్ తో కలిసి ఈ పబ్లిసిటీ డ్రామా ఆడుతున్నారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  ఒక వారం నుండి ఈ వివాదాల పుణ్యమా అని 'మణికర్ణిక' తప్ప.. మరో బాలీవుడ్ సినిమా గరించి జనాలు మాట్లాడుకోవడం లేదన్నది మాత్రం నిజం. ఇది నమ్మబుద్ధికాని వెర్షనే.. అయినా బాలీవుడ్ సినిమాల విషయంలో ఏదైనా సాధ్యమే!

Tags:    
  • Kamal Jain 
  • Kangana Ranaut 
  • Manikarnika 
  • telugu News 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS