తెలుగు ప్రేక్షకుల కోసం కమల్ స్పెషల్ వీడియో
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నటించిన సినిమా చాలా సంవత్సరాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ ఓపెనింగ్ ను దక్కించుకోవడంతో పాటు లాంగ్ రన్ లో భారీ వసూళ్లను నమోదు చేసుకుంది. అదే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్. ఈ సినిమా లో కమల్ హాసన్ తో పాటు ఫాహద్ ఫాసిల్.. విజయ్ సేతుపతితో పాటు చివర్లో సూర్య కూడా కనిపించాడు. ఒక మల్టీ స్టారర్ మూవీగా వచ్చిన విక్రమ్ కు మంచి స్పందన దక్కింది.
ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా లాంగ్ రన్ లో రెండు వందల కోట్లకు పైగానే వసూళ్లు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో మాత్రమే కాకుండా తమిళంలో కూడా చాలా కాలం తర్వాత ఒక భారీ కమర్షియల్ హిట్ కమల్ హాసన్ కు విక్రమ్ సినిమా తో దక్కింది. ఆరు పదుల వయసు లో కమల్ హాసన్ మళ్లీ ఫామ్ లోకి రావడం అసాధ్యం అంటూ కొందరు భావించారు.
అలా అనుకున్న వారి నోళ్లు మూయించి విక్రమ్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ విజయాన్ని అభిమానులతో కమల్ షేర్ చేసుకుంటూ ఉన్నాడు. హీరోగా ఆయన నటించిన సినిమాలు చాలా తెలుగు లో సక్సెస్ అయ్యాయి. అందుకే ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో స్పషల్ గా తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. మంచి సినిమాలను ఎప్పుడు కూడా తెలుగు ప్రేక్షకులు ఆధరిస్తారు. అందుకు చాలా సంతోషం అన్నాడు.
సినిమా లో నటించిన నటీ నటులు మరియు పని చేసిన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణులకు కూడా కమల్ హాసన్ కృతజ్ఞతలు చెప్పారు. తమ్ముడు సూర్య చివరి మూడు నిమిషాల్లో వచ్చి సినిమా స్థాయిని మరింతగా పెంచాడు. తప్పకుండా భవిష్యత్తులో మేము ఇద్దరం కలిసి నటించి ఆయన రుణం తీర్చుకుంటాను అన్నట్లుగా కమల్ హాసన్ వీడియో లో చెప్పుకొచ్చాడు. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా తెలుగు లో మాట్లాడుతూ కృతజ్ఞతలు చెబుతూ వీడియోను విడుదల చేయడంతో వైరల్ అయ్యింది.
కమల్ హాసన్ కు విక్రమ్ ఇచ్చిన బూస్ట్ తో మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నాడు. భారీ అంచనాల నడుమ మొదలు అయ్యి నిలిచి పోయిన ఇండియన్ 2 మరియు శభాష్ నాయుడు సినిమా లను ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని కమల్ ప్రకటించాడు. అయితే అవి తిరిగి పట్టాలెక్కేందుకు కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు అనేది తమిళ మీడియా వర్గాల వారి అభిప్రాయం.