• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుజరాతీ పాఠాలు...

గుజరాతీ పాఠాలు నేరుస్తున్న సేనాపతి

By - Tupaki Desk
Update: 2019-11-19 10:17 GMT
యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌.. శంకర్‌ ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న 'ఇండియన్‌ 2' చిత్రం కాస్త మెల్లగా చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది చివరకు వరకు సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు శంకర్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇండియన్‌ సినిమాకు ఇది సీక్వెల్‌ అనే విషయం తెల్సిందే. ఇండియన్‌ సినిమాలో మాదిరిగానే కమల్‌ హాసన్‌ ఈ సీక్వెల్‌ లో కూడా సేనాపతి పాత్రను పోషిస్తున్నాడట. 90 ఏళ్ల వృద్ద వ్యక్తి పాత్రలో కమల్‌ కనిపించబోతున్నాడు.

కమల్‌ హాసన్‌ తాను ఏ సినిమా చేసినా ఆ సినిమా కోసం పూర్తి స్థాయిలో కష్టపడతాడనే విషయం తెల్సిందే. ఈ చిత్రం కోసం కమల్‌ కొన్ని సీన్స్‌ లో గుజరాతీలో మాట్లాడాల్సి ఉంటుందట. అందుకోసం కమల్‌ ప్రస్తుతం గుజరాతీ భాషను నేర్చుకునే పనిలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. గుజరాతీ భాష కోసం ఒక ట్రైనీని కూడా పెట్టుకున్నాడట. గుజరాతీ భాషల్లో స్వయంగా తానే డబ్బింగ్‌ చెప్పుకోవాలనే ఉద్దేశ్యంతో కమల్‌ గుజరాతీ భాషను నేర్చుకుంటున్నాడు.

ప్రస్తుతం కమల్‌ రాజకీయాల్లో ఉన్న కారణంగా ఈ సినిమాపై చాలా హైప్‌ ఉంది. కమల్‌ సేనాపతి పాత్రలో నటిస్తుండగా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కాజల్‌.. సిద్దార్థ.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తో పాటు ఇంకా పలువురు ముఖ్య నటీనటులు నటించబోతున్నారు. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రంను తెలుగు.. హిందీ.. కన్నడ.. మలయాళ భాషల్లో డబ్బింగ్‌ చేసి విడుదల చేయబోతున్నారు. శంకర్‌ గత చిత్రాలు వసూళ్ల విషయంలో నిరాశ పర్చినా కూడా లైకా నిర్మాణ సంస్థ ఈ సినిమా బడ్జెట్‌ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Tags:    
  • Kamal Haasan 
  • Gujarati 
  • Indian 2 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS