నాయుడిని వెంటాడుతున్న కష్టాలు

Update: 2016-07-26 09:30 GMT
విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న ప్రాజెక్టులకు వచ్చినన్ని కష్టాలు ఏ సినిమాలకు ఉండవేమో. ఇప్పటికే చాలా మూవీస్ తో ఇబ్బందులు పడ్డ కమల్.. ఇప్పుడు శభాష్ నాయుడుకి కూడా ఫేస్ చేయక తప్పడం లేదు. కాకపోతే ఇప్పుడీ సినిమాకి కొత్త తరహా సమస్యలొచ్చి పడ్డాయంతే.

శభాష్ నాయుడు మొదలుపెట్టినపుడు దర్శకుడు టీకే రాజీవ్ కుమార్. లైమ్ డిసీజ్ తో ఈ డైరెక్టర్ తప్పుకోవడంతో.. తనే ఆ బాధ్యతలు తీసేసుకున్నారు కమల్. ఇప్పుడాయన తన ఆఫీస్ లోనే మెట్లపై నుంచి పడిపోవడంతో ఫ్రాక్చర్ అయింది. దీంతో నెల రోజులకు పైగా సినిమాకి బ్రేక్ వచ్చింది. ఇవన్నీ కాకుండా సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ పనితీరుతో కమల్ సంతృప్తిగా లేరని అంటున్నారు. మూడు భాషల్లో తీస్తున్న సినిమా కావడంతో.. చాలా ఫాస్ట్ గా పని జరగాలన్నది ఆయన ఆలోచన. అందుకే కెమేరామ్యాన్ ను మార్చేసేందుకు ఆలోచిస్తున్నారట

ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రహ్మానందం కూడా చుక్కలు చూపిస్తున్నాడనే టాక్ ఉంది. స్టార్ కమెడియన్ అనే వైభోగాన్ని వెలగబోయడం.. కమల్ కి అంతగా ఎక్కడం లేదట. మరి ఇన్ని అవరోధాలు ఎదుర్కొని శభాష్ నాయుడు ఎప్పటికి పూర్తవుతుందో!
Tags:    

Similar News