• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అవును.. రోబో-2 కోసం...

అవును.. రోబో-2 కోసం అడిగారు-కమల్

By - Tupaki Desk
Update: 2016-05-26 17:52 GMT
అసలు ‘రోబో’ సినిమాను ముందు అనుకున్నది కమల్ హాసన్ తోనే. ఆయనతో శంకర్ ఫొటో షూట్ చేసిన సంగతి కూడా అందరికీ తెలుసు. కమల్ హాసన్+రోబో అని గూగుల్ లో కొడితే ఆ ఫొటో షూట్ కు సంబంధించిన ఫొటోలు కూడా కనిపిస్తాయి. ఐతే అనివార్య కారణాల వల్ల శంకర్ కమల్ తో ఆ సినిమాను తెరకెక్కించలేకపోయాడు. తర్వాత షారుఖ్ ఖాన్ ను సంప్రదించి.. అతను కాదన్నాక రజినీ దగ్గరికి వచ్చాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రోబో’ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయింది. ఇప్పుడు ‘రోబో-2’తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు శంకర్.

‘రోబో’ను కమల్ తో చేయలేకపోయినా.. రోబో-2లో ఆయన్ని నటింపజేయడానికి శంకర్ ప్రయత్నించినట్లుగా ఆ మధ్య వార్తలొచ్చాయి. కమల్ ను విలన్ రోల్ కు అడిగినట్లు కూడా చెప్పుకున్నారు. ఐతే రజినీ సినిమాలో కమల్ విలన్ గా చేయడమేంటి అని ఈ వార్తల్ని కొట్టిపారేశారు చాలామంది. ఐతే ఇప్పుడు కమలే స్వయంగా చెబుతున్నాడు.. తనను రోబో-2 కోసం అడిగారని. ఐతే రజినీతో తనకున్న ఓ ఒప్పందం వల్ల ఈ సినిమాలో నటించలేకపోయానని కమల్ వెల్లడించాడు. రజినీ.. తాను ఒకప్పుడు చాలా సినిమాలు చేశామని.. ఐతే తర్వాత విరామం వచ్చిందని.. ఆ సమయంలో తామిద్దరం మళ్లీ కలిసి నటించాల్సి వస్తే ఇద్దరిలో ఒకరు నిర్మాతగా ఉండాలని.. అలాంటపుడే తమ కాంబినేషన్ తెరమీదికి రావాలని ఇద్దరూ ఒప్పందం చేసుకున్నారట. ఐతే ‘రోబో-2’ నిర్మాతలు బయటివాళ్లు కావడంతో తాను ఆ సినిమా చేయలేదని అన్నాడు కమల్.
Tags:    
  • Kamal Haasan 
  • Shankar 
  • Robo 2 Movie 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS