• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ అయిపోయాడు.. బన్నీ...

పవన్ అయిపోయాడు.. బన్నీ మీద పడ్డాడు

By - Tupaki Desk
Update: 2017-07-03 11:01 GMT
కమల్ ఆర్.ఖాన్ అని ట్విట్టర్లో తనను తాను గొప్ప క్రిటిక్ గా.. మేధావిగా చెప్పుకునే ఓ వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషనల్ కామెంట్లు చేయడం.. ఎవరినో ఒకరిని తిట్టడం ఇతడికి హాబీ. ఆ రకంగానే ట్విట్టర్లో ఫాలోయింగ్ బాగానే సంపాదించుకున్నాడు. ఆ ఫాలోయింగ్ చూసుకుని మరింతగా రెచ్చిపోతుంటాడు. బాలీవుడ్లో చాలామందిని టార్గెట్ చేసి చేసి అలసిపోయాడతను. వాళ్లందరూ ఇతణ్ని పట్టించుకోవడం మానేశారు. ఐతే ఈ మధ్య కమల్ ఆర్.ఖాన్ సౌత్ ఇండస్ట్రీ మీద పడ్డాడు. ఇక్కడి సూపర్ స్టార్ల గురించి అవాకులు చెవాకులు పేలుతున్నాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజ్ టైంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి ఇష్టానుసారం మాట్లాడిన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అతడిపై రివర్స్ అటాక్ చేసి.. అతడికి కావాల్సిన పబ్లిసిటీ చేసి పెట్టారు. తర్వాత మోహన్ లాల్ ను టార్గెట్ చేయడం ద్వారా ఆయన అభిమానుల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నాడు. తర్వాత ‘బాహుబలి-2’ను కూడా తిట్టిపోశాడు. మీడియాలో హైలైట్ అయ్యాడు.

ఇప్పుడు కమల్ కళ్లు సౌత్ ఇండియాలో పెద్ద స్టార్ గా ఎదుగుతున్న అల్లు అర్జున్ మీద పడింది. ‘దువ్వాడ జగన్నాథం’ సల్మాన్ సినిమా ‘ట్యూబ్ లైట్’ కన్నా ఎక్కువ వసూళ్లు సాధించిందంటూ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేయడం బాలీవుడ్లో చర్చనీయాంశం అయిన నేపథ్యంలో కమల్ దృష్టి బన్నీపై పడింది. బన్నీని ఉద్దేశించి ‘లుక్కా’ అనే పదం వాడాడు కమల్. అంతటితో ఆగలేదు.

టాలీవుడ్లో అల్లు అర్జున్ పెద్ద స్టార్ అని తనకెవరో చెప్పారని..  కానీ హిందీ సినిమాల్లో మాత్రం అతను చిన్న చిన్న వేషాలకు మాత్రమే పనికొస్తాడని బన్నీని చిన్నబుచ్చే ప్రయత్నం చేశాడు కమల్. అంతే ఇక అల్లు అర్జున్ ఆర్మీ అతడిపై అటాక్ మొదలుపెట్టింది. ఈ మంటలో చలి కాచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నాడు కమల్. అతణ్ని ఇగ్నోర్ చేయడమే సరైన మందు అని మన జనాలు తెలుసుకోకపోవడంతో ఇంకా ఇంకా రెచ్చిపోతున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Kamaal R Khan 
  • Allu Arjun 
  • Telugu NEWs 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS