• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘ఓం’ కష్టనష్టాలపై కళ్యాణ్...

‘ఓం’ కష్టనష్టాలపై కళ్యాణ్ రామ్..

By - Tupaki Desk
Update: 2018-06-10 04:29 GMT
నందమూరి కళ్యాణ్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్‌ గా నిలిచిన సినిమా ‘ఓం’. ఇండియాలో తొలి త్రీడీ యాక్షన్ ఫిలిం అంటూ దీని గురించి చిత్ర బృందం గొప్పగానే ప్రచారం చేసుకుంది. కళ్యాణ్ రామ్ ఏకంగా రూ.25 కోట్ల దాకా ఖర్చు పెట్టి.. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ సినిమాను నిర్మించాడు. కానీ ఆ చిత్రం దారుణమైన ఫలితాన్నందుకుంది. ఆ చిత్రానికి త్రీడీ ఏమంత ఆకర్షణ కాలేకపోయింది. దాదాపుగా పెట్టుబడి మొత్తం పోగొట్టుకున్నాడు కళ్యాణ్. ఆ సినిమా గురించి మాట్లాడినపుడల్లా చాలా ఆవేదన వ్యక్తం చేస్తాడతను. తన కొత్త సినిమా ‘నా నువ్వే’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కళ్యాణ్ రామ్ ‘ఓం’ కష్టనష్టాల గురించి పంచుకున్నాడు. ఆ సినిమా తననెంతగా దెబ్బ కొట్టిందో.. అసలా సినిమా ఎందుకు పోయిందో వివరించాడు.

‘‘ఓం సినిమాతో కొత్తగా ఏదో చేయాలనుకున్నా. అప్పటికి మనకు త్రీడీ అంతగా తెలియదు.. ఓ టెక్నాలజీని చూపిద్దాం అనుకున్నా. ఐతే ఏదైనా కొత్త సాంకేతికతను ప్రవేశపెడుతున్నపుడే అందులోని ఇబ్బందులు తెలిసొస్తాయి. రోజులు గడుస్తున్న కొద్దీ అనుభవంలోకి వస్తాయి. ఆ సినిమా విషయంలో అదే జరిగింది. కెమెరా అమర్చుకోవడానికే గంట సమయం పట్టేది. ఒకసారి కెమెరా సెట్ చేస్తే దాన్ని ముందుకు వెనక్కి కదపడానికి అవకాశముండేది కాదు. హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకురావడంతో బడ్జెట్ పెరిగిపోయింది. వాళ్లు గంటకు ఇంత అని పని చేసేవాళ్లు. దీంతో ఖర్చు బాగా పెరిగిపోయింది. మూడేళ్ల శ్రమ ఆ సినిమా. నా కష్టం.. డబ్బు అన్నీ దాంట్లో పెట్టా. దాని ఫలితం నాకు పెద్ద షాక్. డబ్బులు చాలా పోయాయి. ఐతే నేనేమీ గ్యాంబ్లింగ్ చేసి డబ్బులు పోగొట్టుకోలేదు కదా.. సినిమాతోనే కదా అని సరిపెట్టుకున్నా’’ అని కళ్యాణ్ రామ్ తెలిపాడు.
Tags:    
  • Kalyan Ram 
  • Om Movie Failure 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS