ఓహ్‌.. అఖిల్‌ సినిమా అతని చేతిలో?

Update: 2016-01-19 09:30 GMT
మొన్ననే ఆల్రెడీ చెప్పుకున్నాంగా.. తనకు ''సోగ్గాడే చిన్ని నాయనా'' సినిమాతో సర్‌ ప్రైజ్‌ హిట్టిచ్చిన కళ్యాణ్‌ కృష్ణ కురసాల కే మరోసారి నాగార్జున ఛాన్సు ఇస్తున్నాడని.. అయితే నాగ్‌ ఈ కుర్ర డైరక్టర్‌ ను తనతో సినిమా చేయమని అడగట్లేదు. తన చిన్న కొడుకుతో చేయమంటున్నాడు.

ఇప్పటికే అఖిల్‌ కోసం రెండు క్లాస్‌ మూవీ లైన్లు రెడీ చేసి.. అవి రెండూ కళ్యాణ్‌ కృష్ణ చేతిలో పెట్టేశాడట నాగ్‌. ఈ రెండింటికీ ఇప్పుడు మన యంగ్‌ డైరక్టర్‌ మాటలు రాసుకొచ్చే పనిలో పన్నాడు. వీటిలో ఏది ఇంట్రరెస్టింగ్‌ గా అనిపిస్తే.. ఆ కథతో అఖిల్‌ రెండో సినిమాగా ముందుకు తీసుకెళ్ళాలని నాగ్‌ భావిస్తున్నట్లు ఇండస్ర్టీ టాక్‌. అఖిల్‌ కోసం రెడీ చేస్తున్న ఈ రెండు కథలూ రొమాంటిక్‌ సినిమాలేనట.

అయితే అంత త్వరగా అఖిల్‌ సినిమాను ఇలాంటి యంగ్‌ డైరక్టర్‌ చేతిలో పెట్టేస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. త్రివిక్రమ్‌.. సుకుమార్‌.. దశరథ్‌.. ఇలాంటి పెద్ద పేర్లు అన్నీ వినిపించాక ఇప్పుడు కళ్యాణ్‌ కృష్ణ పేరు వినిపించడం విశేషమే. అంతే బాసూ.. సక్సెస్‌ కొడితే ఆల్‌ ఈక్వేషన్స్‌ ఆటోమ్యాటిక్‌ గా మారిపోతాయ్‌.
Tags:    

Similar News