సెంటిమెంట్ అచ్చిరాక మళ్లీ మార్చాడుగా

Update: 2016-06-10 15:30 GMT
ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిని అందుకోలేకపోయామని.. కోరుకున్న స్థాయిని చేరలేకపోయామని.. సెంటిమెంట్లను ఫాలో అయేవారు చాలామందే కనిపిస్తారు. ముఖ్యంగా పేరు మార్చుకుంటే లక్ కలిసొస్తుందనే సెంటిమెంట్ చాలాకాలంగా ఉన్నదే. అయితే.. తమ పేరులోని స్పెల్లింగ్ లో అక్షరాలను తొలగించడమో, కొత్తగా అక్షరాలను యాడ్ చేయడమో జరుగుతూ ఉంటుంది. అయితే.. మొత్తంగా పేరు మార్చేసుకుని మళ్లీ ఫ్రెష్ గా రంగంలోకి దిగిపోయేవారు కూడా కొంతమంది ఉంటారు.

ఎంఎం కీరవాణికి సోదరుడైన కళ్యాణి మాలిక్.. కోరస్ సింగర్ నుంచి ప్లేబ్యాక్ సింగర్ గా.. అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఐతే  అష్టా చెమ్మా - అలా మొదలైంది ఊహలు గుసగుసలాడే లాంటి హిట్ చిత్రాలు ఖాతాలో ఉన్నా.. ఈయన స్టార్ కంపోజర్ గా మాత్రం ఎదగలేకపోయాడు. ఎప్పటికప్పుడు పేర్లు మార్చుకుంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు.

మొదటగా కళ్యాణి మాలిక్.. ఆ తర్వాత కళ్యాణి కోడూరి.. నెక్ట్స్ కోడూరి కళ్యాణ్‌.. ఇప్పుడు కళ్యాణ రమణ.. ఇలా ఇప్పటికి నాలుగుసార్లు పేర్లు మార్చేశాడీ మ్యూజిక్ డైరెక్టర్. మార్చ్ లో ''కళ్యాణ్‌ వైభోగమే'' సినిమా చేసినప్పుడైతే.. కోడూరి కళ్యాణ్‌ అనే పేరును ఇక మార్చుకోబోనని గట్టిగానే చెప్పాడు. అయినా సరే.. మళ్లీ మూడ్ మారిపోయిన ఈ మ్యూజిక్ డైరక్టర్.. కొత్తపేరుతో మరోసారి ప్రయత్నిస్తున్నాడు. తగిన బ్రేక్  రాకపోతే జాతకాలను టాలీవుడ్ ఏ రేంజులో నమ్ముతుందో అనేందుకు ఈయన చక్కని ఉదాహరణ. ఇప్పటికైతే కొత్త పేరుతో జ్యో అచ్యుతానంద సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.
Tags:    

Similar News